Tuesday, April 16, 2024
- Advertisment -
HomeEntertainmentRashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్‌ పోస్తా అంటూ జబర్దస్త్‌ యాంకర్‌పై సోషల్‌ మీడియాలో...

Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్‌ పోస్తా అంటూ జబర్దస్త్‌ యాంకర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

Rashmi Gautam | జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌ ఇప్పుడు నెటిజన్లకు టార్గెట్‌ అయ్యింది. ఆమెపై కొందరు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. తీవ్ర విమర్శలు చేయడమే కాదు.. తనపై చేతబడి చేయిస్తామని.. యాసిడ్‌ పోస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న రష్మి గౌతమ్‌ వాటిని స్క్రీన్‌షాట్‌ తీసి మరోసారి పోస్టు చేసింది. ఈ కామెంట్స్‌పై ఫిర్యాదు చేయాలని ప్రశ్ని్స్తూ పోస్టు పెట్టింది. అయినా సరే ఆమె మీద వేధింపులు ఆగడం లేదు.

అంతలా రష్మి గౌతమ్‌ మీద నెటిజన్లు విరుచుకుపడటానికి కారణం ఏంటని అనుకుంటున్నారా! ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో ఓ చిన్నారి మరణించాడు కదా.. ఈ ఘటనపై స్పందిస్తూ తాజాగా రష్మి గౌతమ్‌ ట్వీట్‌ చేసింది. దురదృష్టవశాత్తూ తమ తప్పు లేకుండానే వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి చనిపోయాడు. ఇది చాలా హృదయవిదారక విషయం. ఇలాంటి ఘటనలు జరకుండా చర్యలు తీసుకోవాలి. వీధికుక్కల బర్త్‌ కంట్రోల్‌కు స్టెరిలైజేషన్‌ తప్పనిసరిగా చేయాలని రాసుకొచ్చింది. అంతటితో ఆగకుండా వీధికుక్కలకు సరైన వసతి కల్పించాలి. ఎందుకంటే అవి కూడా మనలాంటి ప్రాణులే అంటూ పేర్కొంది. దీంతో పాటు గోసంరక్షణ మీద కూడా ట్వీట్‌ చేసింది. ఈ భూమి మీద మనుషులం మాత్రమే బతుకుతున్నామా? జంతువుల పట్ల ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాం. అంటూ రష్మి రాసుకొచ్చింది. దీంతో ఓ పిల్లాడు చనిపోయినా సరే వీధి కుక్కలపై ప్రేమ కురిపించడం ఏంటని రష్మిపై నెటిజన్లు మండిపడుతున్నారు. కొంతమంది ఆమెను కుక్కతో పోలుస్తుంటే.. మరికొందరు శ్రుతి మించి కామెంట్లు పెడుతున్నారు.

ఆల్రెడీ నీకు 40 ఏళ్లు వచ్చేశాయి. ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి చేసుకో అని మొదట ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు. ఆ తర్వాత కాస్త డోస్‌ పెంచి.. నీ మీద చేతబడి చేయిస్తా పాపిస్టి దానా.. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. అవుల వల్ల యాక్సిడెంట్స్‌ అవుతాయా? నీ మీద యాసిడ్‌ పోస్తా. మూసుకుని ఇంట్లో ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాలు పడతావు అంటూ కామెంట్లు పెట్టాడు. వీటిని చూసిన రష్మి సీరియస్‌ అయ్యింది. ఆ స్క్రీన్‌షాట్స్‌ను షేర్‌ చేస్తూ .. ఈ అకౌంట్‌ ఎవరిదో తెలియదు కానీ.. నాపై యాసిడ్‌ పోస్తా.. చేతబడి చేస్తా అంటూ బెదిరిస్తున్నాడు. ఇవన్నీ అన్నందుకు నీమీద పోలీస్‌ కంప్లయింట్ ఇవ్వాలా అంటూ మండిపడింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News