Home Latest News Whatsapp | వాట్సాప్లో పాత మెసేజ్లను ఇక ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు

Whatsapp | వాట్సాప్లో పాత మెసేజ్లను ఇక ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు

Whatsapp | స్మార్ట్ఫోన్ ఉందంటే చాలు.. అందులో వాట్సాప్ ఇప్పుడు మస్ట్ అయిపోయింది. మెసేజ్లు చేయడం నుంచి మొదలుపెడితే ఫొటోలు, వీడియోలు పంపించడానికి.. కాల్స్ మాట్లాడటానికి చాలామంది దీన్నే వాడుతున్నారు. పర్సనల్ పనులతో పాటు ఆఫీసు పనులకు కూడా వాట్సాప్నే ఉపయోగిస్తున్నారు. ఇలా అన్నింటికీ వాట్సాప్నే వాడుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడో నెల కిందో.. రెండు నెలలో కింద వాట్సాప్లో షేర్ చేసిన ముఖ్యమైన విషయం ఇప్పుడు అర్జెంట్గా కావాలి. అప్పుడేం చేస్తారు. పాత సమాచారంలో గుర్తున్న ఏదో ఒకటి రెండు పదాలను వాట్సాప్ సెర్చ్లో వెతుకుతారు కదా. అప్పుడు మనకు కావాల్సిన సమాచారం కచ్చితంగా దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు.. వాట్సాప్ చాట్ను పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్లాల్సిందే కదా.. కానీ ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. దీనికోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ను తీసుకొస్తోంది.

వాట్సాప్లో ఏ రోజు ఏ మెసేజ్ వచ్చిందనేది తేదీల వారీగా సెర్చ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. యూజర్ల వారీగా కూడా చాట్ను కూడా ఇందులో వెతుక్కోవచ్చు. ఇందుకోసం సెర్చ్బార్ పై క్లిక్ చేసినప్పుడు క్యాలెండర్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అందులో ట్యాప్ చేసి తేదీ, నెల, సంవత్సరం ఎంచుకుంటే.. ఆరోజు వచ్చిన మెసేజ్లు కనిపిస్తాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

find your twin | అచ్చం మీలాగే మరో వ్యక్తి ఉన్నాడో లేదో తెలుసుకోవాలని ఉందా?

Google | షాక్ ఇచ్చిన సెర్చింజిన్‌ సంస్థ..12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Whatsapp | వాట్సాప్ లో ఉన్న ఈ లిమిటేషన్స్ గురించి ఈ విషయాలు తెలుసా

chatGPT | చాట్‌జీపీటీ కలకలం.. ఈ యాప్ మీ ఫోన్‌‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి

Exit mobile version