Home Entertainment Movies of The Week | ఈ వారం ఓటీటీ, థియేటర్లలో ఇన్ని సినిమాలు వస్తున్నాయా?

Movies of The Week | ఈ వారం ఓటీటీ, థియేటర్లలో ఇన్ని సినిమాలు వస్తున్నాయా?

Movies of The Week | ఈ ఏడాది జనవరి మాసం బాక్సాఫీస్ కు మంచి గిట్టు బాటే అయింది. సంక్రాంతి మొదలు కొని రిపబ్లిక్ డే వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతూనే ఉంది. ఈ ఒక్క నెలలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.400 కోట్ల కనక వర్షం కురిసింది. అది కూడా చివరి 15 రోజుల్లోనే. మొదటి రెండు వారాలు చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కాలేవు. ఇక గతవారం పఠాన్, హంట్ సినిమాలు రిలీజ్ కాగా.. పఠాన్ సునామీలో హంట్ కొట్టుకుపోయింది. పేరుకు పఠాన్ డబ్బింగ్ సినిమానే అయినా.. స్ట్రేయిట్ తెలుగు సినిమా రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుంది. కాగా వచ్చే వారం కూడా థియేటర్లలో సందడి నెలకొననుంది. ఫిబ్రవరి మొదటి వారం థియేటర్ ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.

మైఖేల్

ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం అవుతున్నా సందీప్ కిషన్ ఇంకా సరైన హిట్టు కొట్టలేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, A1 ఎక్స్ ప్రెస్, నిను వీడని నీడను నేనే వంటి పలు హిట్లను వెనకేసుకున్నా టైర్2 హీరో రేంజ్ గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయాడు. దాంతో సందీప్ ఆశలన్నీ ప్రస్తుతం మైఖేల్ సినిమాపైనే ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు రంజిత్ జయకోడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రైటర్ పద్మభూషణ్

కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్.. ఈ సినిమాతో థియేటర్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతుంది. మొన్నటి వరకు అంతగా అంచనాలే లేని ఈ సినిమాపై ఇటీవలే రిలీజైన ట్రైలర్ కాస్త బజ్ క్రియేట్ చేసింది.

ప్రేమదేశం

అరుణ్ అధిత్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. సీనియర్ నటి మధుబాల ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ట్రైలర్ కాస్త అంచనాలు క్రియేట్ చేశాయి. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శిరీష సిద్ధమ్ నిర్మించింది.

సువర్ణ సుందరి

సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా ఫిబ్రవరి 3నే రిలీజ్ కానుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మాదారపు సురేంద్ర దర్శకత్వం వహించాడు. రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే కన్నడ రిలీజైన ఈ సినిమా ఇక్కడ ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.

బుట్టబొమ్మ

మలయాళ ముద్దుగుమ్మ అనికా సురేంద్రన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న సినిమా బుట్ట బొమ్మ. అంతేకాకుండా హీరోయిన్ గా అనికా డెబ్యూ సినిమా కూడా ఇదే. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేసింది. షౌరీ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టయిన కప్పెలా మూవీకి రీమేక్ తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు

ఆహా

అన్‌స్టాపబుల్ సీజన్-2 పవన్ కళ్యాణ్ ఎపిసోడ్- ఫిబ్రవరి 3

ముఖచిత్రం- ఫిబ్రవరి 3

కపుల్ ఆన్ బ్యాక్‌ట్రాక్- ఫిబ్రవరి 4

కామెడీ స్టాక్ ఎ‍క్సేంజ్- ఫినాలే ఎపిసోడ్- ఫిబ్రవరి 4

నెట్‌ఫ్లిక్స్‌

పమీలా (హాలీవుడ్)-జనవరి 31

గంతర్స్‌ మిలియన్స్‌ (వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 1

క్లాస్‌ (వెబ్‌సిరీస్‌- సీజన్‌-1) -ఫిబ్రవరి 3

ట్రూ స్పిరిట్‌ ఫిబ్రవరి 3

ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్‌)- ఫిబ్రవరి 3

స్ట్రామ్‌ బాయిల్‌ ఫిబ్రవరి 3
వైకింగ్‌ ఊల్ఫ్‌-ఫిబ్రవరి 3

సోనీలివ్:

జహనాబాద్‌ ఆఫ్ లవ్‌ అండ్‌ వార్‌ (హిందీ) ఫిబ్రవరి 3

డిస్నీ+హాట్‌స్టార్‌:

బ్లాక్‌ పాంథర్‌ వాఖండా ఫరెవర్‌ (హాలీవుడ్‌)-ఫిబ్రవరి 1

సెంబి (తమిళ్‌)-ఫిబ్రవరి 3

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nayanthara | నన్ను కూడా కమిట్‌మెంట్ అడిగారు.. సంచలన విషయం బయటపెట్టిన నయనతార

Jabardasth | జబర్దస్త్ నుంచి సింగర్ మనో ఎందుకు తప్పుకున్నాడు? కారణమేంటి?

Keerthy Suresh | మహానటి ప్రేమ, పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. అసలు నిజమేనని చెప్పేసిన కీర్తి సురేశ్ తల్లి

Ileana | ఆస్పత్రి బెడ్‌పై ఇలియానా.. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నానంటూ పోస్టు

Exit mobile version