Home Latest News Google Street view | స్ట్రీట్‌ వ్యూ, హ్యాంగవుట్స్‌కు గుడ్‌ బై చెప్పిన గూగుల్‌.. కారణమేంటంటే..

Google Street view | స్ట్రీట్‌ వ్యూ, హ్యాంగవుట్స్‌కు గుడ్‌ బై చెప్పిన గూగుల్‌.. కారణమేంటంటే..

Google Street view | తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు చాలామంది గూగుల్‌ మ్యాప్స్‌పై ఆధారపడుతుంటారు. కొంతమంది అయితే స్ట్రీట్‌ వ్యూ యాప్‌ ద్వారా ఆయా ప్రదేశాలను 360 డిగ్రీల యాంగిల్‌లో చూస్తుంటారు. ఇందుకోసం గూగుల్‌ కంపెనీ స్ట్రీట్‌ వ్యూ యాప్‌ని పరిచయం చేసింది. అయితే ఇప్పుడు ఈ యాప్‌ను గూగుల్‌ షట్‌ డౌన్‌ చేసేందుకు సిద్ధమైంది. 2023 మార్చి 31 వరకు మాత్రమే ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఇది అందుబాటులో ఉండదు. గూగుల్‌ మ్యాప్స్‌లో కూడా స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ అందుబాటులో ఉంది. అందుకే దీనికోసం సపరేట్‌గా యాప్‌ మెయింటైన్‌ చేయడం అక్కర్లేదని గూగుల్‌ భావించి.. ఈ నిర్ణయం తీసుకుంది. స్ట్రీట్‌ వ్యూ యాప్‌లో ఉన్న ఫీచర్లు అన్నింటినీ ఇకపై గూగుల్‌ మ్యాప్స్‌లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

స్ట్రీట్‌ వ్యూ మాత్రమే కాదు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ హ్యాంగవుట్‌ను కూడా గూగుల్‌ నిలిపివేస్తుంది. హ్యాంగవుట్‌ తరహాలో ఇప్పటికే చాలా మెసేజింగ్‌ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీంతో గ్రూప్‌ కన్వర్జేషన్‌, డాక్యుమెంట్ ఎడిటింగ్‌, స్లైడర్‌ చాటింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నప్పటికీ ఇది యూజర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే గూగుల్‌ చాట్‌ పేరిట మరో యాప్‌ను కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు ఒకే తరహాలో రెండు యాప్‌లు ఎందుకని భావించిన గూగుల్‌.. హ్యాంగవుట్‌ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. హ్యాంగవుట్‌లో ఉన్న యూజర్ల ప్రొఫైల్స్‌, చాట్‌ హిస్టరీ అన్నింటినీ ఆటోమేటిగ్గా గూగుల్‌ చాట్‌ యాప్‌నకు బదిలీ చేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు క్లౌడ్‌ గేమింగ్‌ సర్వీస్‌ స్టాడియా సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. స్టాడియా ప్లేస్‌లో గూగుల్‌ ప్లే గేమ్స్‌ను ప్రవేశపెట్టింది.

Exit mobile version