Home Latest News Google Maps | ఫోన్‌లో సిగ్నల్ లేకుండానే గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయాలా? ఈ సింపుల్...

Google Maps | ఫోన్‌లో సిగ్నల్ లేకుండానే గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయాలా? ఈ సింపుల్ ట్రిక్ మీకోసమే..

Image by yanalya on Freepik

Google Maps | ఒకప్పుడు తెలియని ప్లేస్‌కు వెళ్లాలంటే కనిపించిన వాళ్లను అడుక్కుంటూ వెళ్లేవాళ్లం. కానీ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మాత్రం గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడుతున్నాం. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లాలనుకున్నా సరే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుని సింపుల్‌గా వెళ్లిపోవచ్చు. కానీ ఇది ఇంటర్నెట్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి ఏదైనా రిమోట్ ఏరియాకు వెళ్లినప్పుడు.. ఫోన్‌లో సిగ్నల్ లేనప్పుడు అడ్రస్ వెతకాలంటే ఎలా? అందుకే గూగుల్ ఒక ట్రిక్‌ను అందిస్తుంది. దీన్ని యూజ్ చేసుకుంటే ఇంటర్నెట్ లేని టైమ్‌లో కూడా ఈజీగా గూగుల్ మ్యాప్స్ వాడుకోవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్ ఎలా వాడుకుంటామని ఆశ్చర్యపోతున్నారా? దీనికోసం పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరమేమీ లేదు. మీకు కావాల్సిన లొకేషన్‌ను ముందుగానే మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. అప్పుడు ఇంటర్నెట్ లేకపోయినా సరే ఆ ప్రాంతంలోని అన్ని రూట్లను గూగుల్ మ్యాప్స్‌లో చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌తో ఐవోఎస్‌లో కూడా ఈ ఫీచర్‌ను గూగుల్ అందుబాటులో ఉంచింది. మరి దీన్ని ఎలా వినియోగించుకోవాలంటే..

☞ ముందుగా మీ మొబైల్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి.

☞ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్‌లో ఉండే ప్రొఫైల్ పిక్‌పై క్లిక్ చేయాలి.
ప్రొపైల్ పిక్‌పై క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఆఫ్‌లైన్ మ్యాప్స్‌ను ఎంచుకోవాలి.

☞ అప్పుడు సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్ అనే ఆప్షన్ వస్తుంది.

☞ దాని మీద క్లిక్ చేసినప్పుడు డౌన్‌లోడ్ దిస్ మ్యాప్ అని వస్తుంది. మీరు ఎంత రేంజ్‌లో ఏరియాను డౌన్‌లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.

☞ అనంతరం కుడి వైపు కింది భాగంలో ఉన్న డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మరోసారి కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

☞ అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఏరియా మొత్తం గూగుల్ మ్యాప్స్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఇంటర్నెట్ లేకున్నా సరే అక్కడి రూట్స్ అన్నింటినీ యాక్సెస్ చేసుకోవడానికి వీలవుతుంది.

☞ ఒకవేళ ఇదివరకే ఏదైనా మ్యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారో లేదో కూడా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుని చూడవచ్చు. ఆఫ్‌లైన్ మ్యాప్స్‌పై క్లిక్ చేసినప్పుడు సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్ కింద మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఏరియా లిస్ట్ ఉంటుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

apple | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు పొందే బంపర్ ఛాన్స్

ChatGPT | అసలేంటి చాట్‌జీపీటీ.. మనిషి జీవితాన్ని నిజంగానే మార్చే శక్తి ఉందా? విద్యా సంస్థలు ఎందుకు భయపడుతున్నాయి?

Amazon Offers | బంపర్‌ ఆఫర్‌.. 32వేల రూపాయల 5జీ ఫోన్‌ కేవలం 8వేలకే..

whatsapp | ఇకపై చాట్‌ బ్యాకప్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.. అదిరిపోయే ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌

Exit mobile version