Home Latest News KTR | కంటెంట్ ఉంటే సినిమానే హిట్టవుతది.. కంటెంట్ ఉన్న కేసీఆర్ పాన్ ఇండియాలో ఎందుకు...

KTR | కంటెంట్ ఉంటే సినిమానే హిట్టవుతది.. కంటెంట్ ఉన్న కేసీఆర్ పాన్ ఇండియాలో ఎందుకు హిట్ కాడు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Telangana IT Minister Kalvakuntla Taraka Rama Rao

KTR | భారత రాష్ట్ర సమితి ఏర్పాటుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని తెలుగు సినిమాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత కే. దశరథ్ రాసిన కథా రచన పుస్తకాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. కంటెంట్ ఉన్న సినిమా దేశమంతా ఆడుతున్నప్పుడు.. కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదని, కానీ కరోనా టైంలో మాట్లాడేప్పుడు అందరూ టీవీలకు అతుక్కుపోయేవారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్పగల సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అయితే దాని వెనుక ఎంతో కృషి ఉంటుందన్నారు. ” కంటెంట్ ఉన్న తెలుగు సినిమా పాన్ ఇండియాలో సత్తా చాటుతోంది. మరి కంటెంట్ ఉన్న తెలుగు నాయకుడు ఎందుకు హిట్ కాడు ? తెలంగాణలో ఎనిమిదేళ్లలో అసాధ్యం అనుకున్న విషయాలను సుసాధ్యం చేసిండు. ఇలాంటివి దేశంలో ఎందుకు సాధ్యం కావు. ప్రజలను ఒప్పించగిలితే ఏదైనా సాధ్యమే. ఏ పని కొత్తగా మొదలుపెట్టినా తిట్టే వాళ్లు, విమర్శించే వాళ్లు.. అవుతుందా అనేవాళ్లే ఉంటారు. ఈయనతో ఏమవుతది అనే వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ అల్టిమేట్‌గా కంటెంట్ ఉంటే సినిమా అయినా హిట్టవుతుంది. నాయకుడైనా, పార్టీ అయినా తప్పకుండా హిట్టవుతుందనే విశ్వాసం ఉంది. ఆ నమ్మకంతోనే పాన్ ఇండియాకి వెళుతున్నామని . మేం కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నా” అంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దశరథ్ రాసినప కథా రచన పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ తరఫున ప్రచురించిందని కేటీఆర్ చెప్పారు. తనకు సినిమాతో పాటు క్రియేటివ్ కంటెంట్ అంటే ఇష్టమని అన్నారు. ప్రతిరోజూ 11, 12 పేపర్లు చదువుతానని, అట్లే మంచి బుక్స్ కనపడినా చదువుతానని అన్నారు. అమెరికాలో మాక్ డేమిన్ వాళ్లు రాసిన స్క్రీన్ ప్లే బుక్ గతంలో చదివినట్లు చెప్పారు. అలాంటి పుస్తకాలు తెర వెనుక ఉండే టెక్నీషియన్లకు ఉపయెగపడతాయని అన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More:

Telangana Assembly Elections | తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? మార్చిలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా ?

Chandrababu | తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటే నష్టం ఎవరికి ? లాభం ఎవరికి .. చంద్రబాబు ఎత్తుగడ అదేనా!

Roja Vs Nagababu | జబర్దస్త్ మాజీ జడ్జీల మధ్య మాటల యుద్ధం.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది.. నాగబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

Breaking News | గుండెపోటుతో చిన్నకొడుకు.. శ్మశానానికి తరలిస్తుండగా పెద్దకొడుకు.. గంట వ్యవధిలో ఇద్దరు మృతి.. మెట్‌పల్లిలో విషాదం

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… నేరుగా రంగంలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ?

Exit mobile version