Home Latest News whatsapp | ఇకపై చాట్‌ బ్యాకప్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.. అదిరిపోయే ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌

whatsapp | ఇకపై చాట్‌ బ్యాకప్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.. అదిరిపోయే ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌

whatsapp | పొద్దున లేచించి మొదలు రాత్రి పడుకునే దాకా అన్ని కన్వర్జేషన్ష్‌ వాట్సాప్‌ ద్వారానే జరుగుతున్నాయి. పర్సనల్‌ వర్క్‌, ఆఫీస్‌ వర్క్‌.. ఇలా అన్నింటికీ వాట్సాప్‌ మీదనే ఆధారపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాట్సాప్‌ పనిచేయకపోతే ఆ రోజంతా పని ఆగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంత ఇంపార్టెన్స్‌ ఉంది కాబట్టే వాట్సాప్‌ చాట్‌ను ఎప్పటికప్పుడు బ్యాకప్‌ చేస్తుంటారు. దీనికోసం గూగుల్‌ డ్రైవ్‌లో స్టోరేజి లేకపోయినా సరే మిగిలిన డేటాను డిలీట్ చేసి మరీ వాట్సాప్‌ చాట్‌ హిస్టరీని బ్యాకప్‌ చేస్తుంటారు. దీనికోసం యూజర్లు చాలా ప్రయాస పడాల్సి వస్తుంది.

ఒకే డివైజ్‌లో వాట్సాప్‌ వాడినంతవరకు దీనికి ప్రాబ్లెం ఏమీ లేదు. కానీ కొత్త మొబైల్‌ తీసుకున్నప్పుడు డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే మాత్రం వాట్సాప్‌ బ్యాకప్‌ తీసి ఉండాలి. అలాంటి టైమ్‌లో గూగుల్‌ డ్రైవ్‌లో స్పేస్‌ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అప్పటివరకు గూగుల్‌ డ్రైవ్‌లో స్టోర్‌ చేసిన ముఖ్యమైన డేటా మొత్తం డిలీట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇకపై ఆ ఇబ్బంది అక్కర్లేదు. చాట్‌ బ్యాకప్‌ చేయకుండానే ఒక డివైజ్‌ నుంచి మరో డివైజ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వెసులుబాటును వాట్సాప్‌ తీసుకొస్తుంది. చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ పేరుతో త్వరలోనే వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

వాట్సాప్‌ ఇన్ఫో వర్గాల కథనం ప్రకారం.. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా ఒక డివైజ్‌ నుంచి మరో డివైజ్‌కు చాట్‌ హిస్టరీని ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. దీనికోసం ఏ డివైజ్‌ నుంచి అయితే డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయాలని అనుకుంటున్నారో.. అందులో వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేస్తే ఒక క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. కొత్త డివైజ్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేసి.. ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సరిపోతుంది. మీ ఓల్డ్ డివైజ్‌లోని డేటా మొత్తం కొత్త డివైజ్‌లోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజిలో ఉన్న ఈ ఫీచర్‌ను ముందుగా బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

flying bike | గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్‌ చేసుకోండి

ChatGPT | అసలేంటి చాట్‌జీపీటీ.. మనిషి జీవితాన్ని నిజంగానే మార్చే శక్తి ఉందా? విద్యా సంస్థలు ఎందుకు భయపడుతున్నాయి?

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

Microsoft | విండోస్‌ 7 వాడే వారికి షాకింగ్‌ న్యూస్‌.. వెంటనే ఈ పనిచేయమని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

Breaking News | గుండెపోటుతో చిన్నకొడుకు.. శ్మశానానికి తరలిస్తుండగా పెద్దకొడుకు.. గంట వ్యవధిలో ఇద్దరు మృతి.. మెట్‌పల్లిలో విషాదం

Exit mobile version