Home Latest News apple | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు పొందే బంపర్ ఛాన్స్

apple | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు పొందే బంపర్ ఛాన్స్

Image Source : Pixabay

apple | యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్. తొందరలోనే ఇండియాలో తమ కంపెనీ రిటైల్ స్టోర్లను తెరిచేందుకు యాపిల్ కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో యాపిల్ స్టోర్లలో పనిచేసేందుకు ఉద్యోగార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టెక్నికల్ స్పెషలిస్ట్, స్టోర్ లీడర్, స్పెషలిస్ట్ సీనియర్ మేనేజర్, ఆపరేటింగ్ ఎక్స్‌పర్ట్, మార్కెట్ లీడర్, మేనేజర్ వంటి వివిధ పోస్టులకు 100 మందిని రిక్రూట్ చేసుకోబోతోంది.

ఐఫోన్లు, ఐప్యాడ్‌లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. కానీ భారత్‌లో మాత్రం యాపిల్ కంపెనీకి ఇప్పటి వరకు రిటైల్ స్టోర్‌లు లేవు. థర్డ్ పార్టీ స్టోర్ల ద్వారా మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయి. సర్వీస్ కూడా థర్డ్ పార్టీ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఇండియాలో యాపిల్ ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఉండటంతో అమెరికా, చైనా తరహాలో ఇక్కడ కూడా డైరెక్ట్‌గా రిటైల్ స్టోర్లను తెరవాలని అనుకుంది. ఇందుకోసం ప్లాన్ చేసినప్పటికీ కొవిడ్ కారణంగా ఆలస్యమైంది. కానీ ఆన్‌లైన్‌లో మాత్రం డైరెక్ట్ విక్రయాలను ప్రారంభించింది. ఇప్పుడు రిటైల్ స్టోర్లను తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే తమ రిటైల్ స్టోర్లలో పనిచేసేందుకు ఉద్యోగాలు కావాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

ఈ కథనం ప్రకారం టెక్నికల్ స్పెషలిస్ట్, స్టోర్ లీడర్, స్పెషలిస్ట్ సీనియర్ మేనేజర్, ఆపరేటింగ్ ఎక్స్‌పర్ట్, మార్కెట్ లీడర్, మేనేజర్ వంటి వివిధ హోదాలకు సంబంధించి మొత్తం 100 మంది ఉద్యోగులను యాపిల్ కంపెనీ రిక్రూట్‌మెంట్ చేయనుంది. ఈ మేరకు యాపిల్ కెరీర్స్ పేజిలో ప్రకటన వెలువరించింది. వీరిని ఢిల్లీ, ముంబై స్టోర్లలో పనిచేసేందుకు తీసుకోనున్నారు. ఈ రెండు నగరాల్లో రిటైల్ స్టోర్స్ ఓపెన్ అయిన తర్వాత రెండో దశలో పుణె, బెంగళూరు వంటి నగరాల్లో కూడా రిటైల్ స్టోర్లను యాపిల్ కంపెనీ తెరవాలని భావిస్తోంది. అప్పుడు మరిన్ని ఉద్యోగవకాశాలు లభించే అవకాశం ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

MMA Fighter Victoria | 18 ఏళ్లకే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ హఠాన్మరణం.. కారణమేంటో?

Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… నేరుగా రంగంలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ?

Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?

Exit mobile version