Home Latest News amazon prime lite | 999కే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్.. కానీ లైట్ బెనిఫిట్స్.. ఏమేం...

amazon prime lite | 999కే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్.. కానీ లైట్ బెనిఫిట్స్.. ఏమేం వస్తాయంటే..

amazon prime lite | కరోనా తర్వాత ఓటీటీ వినియోగం పెరిగిపోయింది. థియేటర్‌లో విడుదలైన సినిమాలు నెల రోజులలోపే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో చాలామంది ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడానికి సుముఖత చూపుతున్నారు. అన్ని ఓటీటీలతో పోలిస్తే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తీసుకోవడానికి జనాలు ఎక్కువగా ఇష్టపడతారు. దీనికి ప్రత్యేకంగా కారణాలేంటో చెప్పక్కర్లేదు అనుకుంటా. ఓటీటీతో పాటు ఈ-కామర్స్ షాపింగ్, ఫాస్ట్ డెలివరీ, మ్యూజిక్, గేమింగ్, ఈ బుక్స్ వంటి అన్ని సర్వీసులు ఒక్కటే సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. అందుకే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకునేందుకు ఇష్టపడతారు.

అయితే గతంలో రూ.999గా ఉన్న సబ్‌స్క్రిప్షన్ ధరను కొంతకాలం కిందట రూ.1499కి పెంచేసింది. దీంతో సామాన్యులకు ఇది భారంగా మారింది. దీంతో బడ్జెట్ ధరలో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు అమెజాన్ సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ లైట్ పేరిట ఈ ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. రూ.999కే ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ను అందించేలా ప్రయోగాత్మకంగా కొత్త ప్లాన్‌ను ప్రవేశపెడుతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌తో పోలిస్తే ప్రైమ్ లైట్‌లో కొన్ని మినహాయింపులు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

❂ అమెజాన్ ప్రైమ్‌ మెంబర్స్‌కు అందిస్తున్న సేమ్ డే డెలివరీ, వన్ డే డెలివరీ సదుపాయాలు లైట్ యూజర్లకు అందుబాటులో ఉండవు. ఫ్రీ డెలివరీ, 2 డేస్ స్టాండర్డ్ డెలివరీ మాత్రమే ఉంటాయి. నో కాస్ట్ ఆఫ్ ఈఎంఐ సదుపాయం కూడా ఉండదు.

❂ అమెజాన్ మ్యూజిక్, గేమ్స్, కిండిల్ సర్వీసెస్‌ను కూడా వినియోగించుకోలేరు. కేవలం ప్రైమ్ వీడియోస్‌లోని వీడియోలను మాత్రమే చూడవచ్చు.

❂ ప్రైమ్ మెంబర్స్‌ ఓటీటీ వీడియోలు చూస్తున్నప్పుడు ఎలాంటి యాడ్స్ రావు. కానీ లైట్ యూజర్లకు మాత్రం వీడియోల మధ్యలో యాడ్స్ వస్తాయి. అలాగే హెచ్‌డీ క్వాలిటీ వీడియోస్‌ను చూడలేరు. మొబైల్ లేదా టీవీ రెండు డివైజ్‌లకు మాత్రమే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. లైవ్ స్పోర్ట్స్ కూడా చూడలేరు.

❂ ప్రైమ్ మెంబర్‌షిప్, ప్రైమ్ లైట్ కాకుండా మొబైల్స్‌ కోసం ఇదివరకే అమెజాన్ సంస్థ ఒక ప్లాన్ తీసుకొచ్చింది. ఏడాదికి రూ.599 చెల్లించడం ద్వారా ప్రైమ్ వీడియోస్‌‌ను ఎంజాయ్ చేయవచ్చు. మ్యూజిక్, బుక్స్, గేమ్స్ ఏమీ ఉండవు. ప్రైమ్ వీడియోస్‌ను కూడా ఎస్‌డీ క్వాలిటీలో మొబైల్‌లో మాత్రమే చూడవచ్చు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Youtube shorts | యూట్యూబ్‌లో షార్ట్స్‌ చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే లక్షలు సంపాదించవచ్చట

Twitter | ఇకపై ఎంత పెద్ద సైజు ట్వీట్స్ అయినా చేయవచ్చు.. ట్విట్టర్‌లో భారీ మార్పులు ప్రకటించిన ఎలన్ మస్క్

apple | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు పొందే బంపర్ ఛాన్స్

whatsapp | ఇకపై చాట్‌ బ్యాకప్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.. అదిరిపోయే ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌

Exit mobile version