Home Latest News Twitter | ఇకపై ఎంత పెద్ద సైజు ట్వీట్స్ అయినా చేయవచ్చు.. ట్విట్టర్‌లో భారీ మార్పులు...

Twitter | ఇకపై ఎంత పెద్ద సైజు ట్వీట్స్ అయినా చేయవచ్చు.. ట్విట్టర్‌లో భారీ మార్పులు ప్రకటించిన ఎలన్ మస్క్

Image by rawpixel.com on Freepik

Twitter | మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలన్ మస్క్ సంచలన మార్పులు చేస్తున్నాడు. ఇప్పటికే పెయిడ్ బ్లూటిక్ ఆప్షన్ తీసుకొచ్చిన మస్క్.. ఇప్పుడు మరిన్ని ఫీచర్లను తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాడు. ట్విట్టర్ ఇంటర్‌ఫేజ్‌ను పూర్తిగా మార్చబోతున్నాడు. దీంతో పాటు ఎంత పెద్ద టెక్ట్స్‌తో అయినా ట్వీట్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నాడు. దీంతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ను తీసుకొస్తున్నాడు. ఇవన్నీ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ విషయాన్ని ఎలన్ మస్క్ స్వయంగా ప్రకటించాడు. దీంతోపాటు మరిన్ని ఫీచర్లను తీసుకువస్తున్నట్టు ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం ఒక ట్వీట్‌లో గరిష్ఠంగా 280 క్యారెక్టర్లు మాత్రమే పోస్టు చేయడానికి కుదురుతుంది. పెద్ద మెసేజ్‌లు చేయాలంటే పార్ట్‌లు పార్ట్‌లు విడగొట్టి ట్వీట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు పెద్ద మెసేజ్‌లు పంపించేందుకు ట్విట్టర్ త్వరలోనే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే 4000 క్యారెక్టర్ల వరకు అనుమతించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ దీనిపై ట్విట్టర్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ట్విట్టర్ బ్లూ యూజర్లు 60 నిమిషాలు ఉన్న పెద్ద వీడియోలతో పాటు, 2జీబీ సైజులో ఉన్న ఫైల్స్‌ను కూడా పంపించే సదుపాయం కల్పిస్తుంది.

ట్విట్టర్‌లో వస్తున్న ఫీచర్లు ఇవీ..

➢ స్క్రీన్‌షాట్స్‌కు బదులు పెద్ద ట్వీట్లు చేసేందుకు వెసులుబాటు
➢ నచ్చిన ట్వీట్లను బుక్‌మార్క్ చేసుకోవచ్చు
➢ కుడి, ఎడమవైపు స్వైపింగ్
➢ రికమండెడ్, ఫాలోడ్ ట్వీట్స్‌ను అనుసరించడం

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

apple | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు పొందే బంపర్ ఛాన్స్

ChatGPT | అసలేంటి చాట్‌జీపీటీ.. మనిషి జీవితాన్ని నిజంగానే మార్చే శక్తి ఉందా? విద్యా సంస్థలు ఎందుకు భయపడుతున్నాయి?

Amazon Offers | బంపర్‌ ఆఫర్‌.. 32వేల రూపాయల 5జీ ఫోన్‌ కేవలం 8వేలకే..

whatsapp | ఇకపై చాట్‌ బ్యాకప్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.. అదిరిపోయే ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌

Exit mobile version