Wednesday, July 24, 2024
- Advertisment -
HomeSportsVirat Kohli | విరాట్ కోహ్లీ నాటు నాటు డ్యాన్స్.. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఇంట్రెస్టింగ్‌...

Virat Kohli | విరాట్ కోహ్లీ నాటు నాటు డ్యాన్స్.. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఇంట్రెస్టింగ్‌ మూమెంట్‌

Virat Kohli | టైమ్ 2 న్యూస్, ముంబై: మైదానంలో తన ఆటతీరుతో పాటు హావాభావాలు, చిలిపి చర్యలతో అభిమానులను ఆకట్టుకునే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తాజా పోరులో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు కాలు కదిపాడు. ఇటీవల ఆస్కార్ పురస్కారం దక్కించుకున్న ఈ పాటలో ఎన్టీఆర్-రామ్‌చరణ్ తరహాలో కోహ్లీ స్టేడియంలో స్టెప్పులు వేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన తొలి పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. దీంతో సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. మిషెల్ మార్ష్ (65 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. జోష్ ఇంగ్లిస్ (26), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (22) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, షమీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (91 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రవీంద్ర జడేజా (69 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (25; 3 ఫోర్లు, ఒక సిక్సర్) సత్తాచాటారు. జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.

తలైవా సమక్షంలో..

ఇండియన్ సినిమా సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. మ్యాచ్ ఆరంభానికి ముందే మైదానానికి చేరుకున్న తలైవా.. ఆట పూర్తయ్యేంతవరకు వీక్షించారు. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత ఫీల్డర్లు వికెట్ తీసిన ప్రతిసారి చప్పట్లతో అభినందించారు. ఆ తర్వాత ఛేదనలో టీమిండియా త్వరత్వరగా వికెట్లు కోల్పోతున్న సమయంలో కాస్త ఆందోళన చెందని రజనీ.. ఆ తర్వాత పాండ్యా, రాహుల్, జడేజా ధాటిగా ఆడుతున్న సమయంలో ఉత్సహంగా కనిపించారు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో అదే ఫామ్ కొనసాగిస్తాడనుకుంటే.. స్టార్క్ వేసిన అద్భుత బంతికి ఎల్బీడబ్లూ్యగా ఔటై నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక లోకల్ బాయ్ సూర్య.. టీ20 తరహాలో దంచికొడతాడనుకున్న ముంబై ఫ్యాన్స్కు భారీ షాక్ తగిలింది. ముంబైలో ఆడుతున్న తొలి వన్డేలో సూర్య గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. అంతకుముందు బంతికి విరాట్ ఔటైన విధంగానే తన వికెట్ స్టార్‌కు సమర్పించుకొని భారంగా డగౌట్ బాటపట్టాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News