Sunday, April 14, 2024
- Advertisment -
HomeEntertainmentOscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Oscars 2023 | ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా పూర్తయ్యింది. అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో మొత్తం 23 కేటగిరీల్లో అవార్డులు అందజేశారు. ఇందులో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా అత్యధికంగా 7 అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ సినిమా 4 కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ది వేల్ సినిమా రెండు ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది. ఇక ఈసారి భారత్‌కు రెండు అవార్డులు వరించాయి. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ది ఎలిఫెంట్ విష్పరర్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ (ఆర్ఆర్ఆర్ ) అవార్డు గెలుచుకుంది. ఇంత ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం పట్ల భారతీయ సినీ ప్రముఖులతో పాటు, సామాన్యులు చాలా గర్వంగా ఫీలవుతున్నారు. ఆయా చిత్రాలకు అభినందనలు తెలుపుతున్నారు. మరి ఇంత గొప్పగా భావిస్తున్న ఆస్కార్ అవార్డు ప్రతిమ ఎక్కడైనా పోతే లేదా విరిగిపోతే పరిస్థితి ఏంటి? దీన్ని అస్కార్ అకాడమీ అవార్డ్స్ కమిటీ ఎలా పరిగిణిస్తుంది?

ఎవరైనా అవార్డు గ్రహీతలు తమకిచ్చిన ప్రతిమను పోగొట్టుకుంటే ముందుగా ఆ విషయాన్ని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారికి తెలియజేయాలి. అవార్డు ప్రతిమ ఎక్కడ, ఎలా పోయిందన్న వివరాలను వాళ్లకు వివరించాలి. అప్పుడు దాని స్థానంలో కొత్త ప్రతిమను అందజేస్తారు. అయితే దీని కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఆస్కార్ ప్రతిమ విరిగిపోవడం లేదా మంటల్లో కాలిపోవడం వంటివి జరిగి ఉంటే పాడైపోయిన ప్రతిమను అకాడమీకి అందజేయాలి. అప్పుడు దాని స్థానంలో కొత్త ప్రతిమను ఇస్తారు. ఎక్కడైనా పోతే లేదా ఎవరైనా ఎత్తుకెళ్తే ముందుగా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వాలి. ఆ ఫిర్యాదు ఆధారంగా కొత్త ప్రతిమ ఇవ్వాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. నేరుగా అకాడమీకి వెళ్లకుండా వెబ్‌సైట్ ద్వారా కూడా కొత్త ప్రతిమ కోసం రిక్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఆస్కార్ అవార్డుపై పూర్తి హక్కులు ఆస్కార్ అకాడమీకే ఉంటాయి. అవార్డు పొందినంత మాత్రన అది పూర్తిగా గ్రహీతది అయిపోదు. అంటే వాళ్లు ఆ అవార్డును తమ దగ్గర ఉంచుకోవచ్చు. అంతేతప్ప అమ్మడానికి కుదరదు. ఒకవేళ ఆస్కార్ అవార్డును అమ్మాలని అనుకుంటే దాన్ని ఆస్కార్ అకాడమీ మాత్రమే తీసుకుంటుంది. ఇందుకోసం ఒక్క డాలర్ మాత్రమే చెల్లిస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News