Friday, April 26, 2024
- Advertisment -
HomeNewsInternationalSilicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న...

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

Silicon Valley Bank | అమెరికాలో బ్యాంకుల సంక్షోభం కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు అతి పెద్ద బ్యాంకులు మూతపడటం అగ్రరాజ్యాన్ని కలవరానికి గురి చేస్తుంది. ముందుగా సిలికాన్ వ్యాలీ బ్యాంకు మూతపడగా.. దాని తర్వాత రెండు రోజుల్లోనే సిగ్నేచర్ బ్యాంక్ కూడా దివాళా తీసింది. ఈ క్రమంలోనే సిలికాన్ వ్యాలీ బ్యాంకు తన యూకే సబ్సిడరీని తాజాగా విక్రయించింది. ఆస్తులపరంగా యూరప్‌లోనే అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతున్న హెచ్‌ఎస్‌బీసీ.. ఈ సబ్సిడరీని కొనుగోలు చేసింది. అయితే ఎస్వీబీని ఎంత మొత్తానికి హెచ్‌ఎస్‌బీసీ చేజిక్కించుకుందో తెలిస్తే మాత్రం నోరెళ్ల బెట్టకమానరు.

సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే సబ్సిడరీని హెచ్‌ఎస్‌బీసీ కేవలం ఒక్క పౌండ్‌కే కొనుగోలు చేసింది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.100 కంటే ఒక్క రూపాయి తక్కువే. అంటే చాలా చాలా చాలా చీప్‌గా సిలికాన్ వ్యాలీ బ్యాంకును హెచ్‌ఎస్‌బీసీ దక్కించుకుందన్నమాట. హెచ్ఎస్‌బీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నోయెల్ క్విన్ మాట్లాడుతూ.. ఎక్సలెంట్ స్ట్రాటజిక్ సెన్స్‌తో ఈ డీల్ జరిగిందని వెల్లడించారు. యూకే బిజినెస్‌ను, కమర్షియల్ బ్యాంకింగ్ ఫ్రాంచైజీ బలోపేతం చేసుకోవడానికి ఈ డీల్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సహా వేగంగా డెవలప్ అవుతున్న సంస్థలకు మెరుగైన సర్వీసులు అందిస్తామని తెలిపారు.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే కస్టమర్లను హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌లోకి ఆహ్వానిస్తున్నామని, వారికి మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాడ్ అనేవి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే విక్రయానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీని వల్ల ఎస్‌వీబీ బ్యాంక్ డిపాజిట్లకు రక్షణ లభిస్తుందని చెప్పుకోవచ్చు. మార్చి 10 నాటికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకేకు 5.5 బిలియన్ పౌండ్ల రుణాలు ఉన్నాయి. అలాగే 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లు ఉన్నాయి. కాగా ఈ డీల్‌లో ఎస్‌వీబీ యూకే పేరెంట్ కంపెనీ ఆస్తులు, అప్పులు మిహాయింపు ఇచ్చారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSPSC | టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు – Time2news.com

TSPSC Group 1 Question Paper Leak | గ్రూప్ 1 పేపర్‌ కూడా లీక్ అయిందా.. నిందితుడు ప్రవీణ్‌కు 103 మార్కులు ఎలా వచ్చాయి ?

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News