Corona Virus | యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో దీన్ని సృష్టించారా? గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందా? 2019 నుంచి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనావైరస్ ఎలా వచ్చిందన్న దానిపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. వుహాన్ ల్యాబ్‌లోనే దీన్ని కృత్రిమంగా సృష్టించారని చాలామంది విశ్వసిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆశ్చర్యకరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రకూన్ కుక్కల ( Raccoon Dogs ) నుంచి కొవిడ్-19 వ్యాపించిందని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. తమ పరిశోధనలో భాగంగా వుహాన్ చేపల మార్కెట్‌లో విక్రయించిన రాకూన్ జాతి కుక్కల జన్యు పదార్థంలో SARS-COV2 వైరస్ ఆనవాళ్లను వాళ్లు గుర్తించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం వెలువరించింది.

చైనాలో కరోనా విజృంభణ మొదలైన సమయంలో అంటే.. 2020 జనవరిలో వుహాన్‌లోని హువానాన్ టోకు చేపల మార్కెట్‌ను మాసేశారు. ఈ మార్కెట్ నుంచే సార్స్ కోవ్-2 వైరస్ వ్యాపించి ఉంటుందనే అనుమానంతో ఆ మార్కెట్‌ను క్లోజ్ చేశారు. ఆ సమయంలో మార్కెట్‌లోని మాంసం నుంచి జన్యు నమూనాలను సేకరించారు. మార్కెట్ నుంచి జంతువులను తరలించడంతో అక్కడి ఖాళీ బోనులు, గోడలు, నేలపై ఉన్న జన్యు నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించారు. దీని నివేదికను అంతర్జాతీయ ఏవియన్ ఫ్లూ సమాచార మార్పిడి వేదికలో ఉంచారు. ఇందులో రాకూన్ కుక్క న్యూక్లిక్ ఆమ్లం, వైరస్ న్యూక్లిక్ ఆమ్లం కలిసిన ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అయితే ఒకవేళ రాకూన్ కుక్కలకు కరోనా వైరస్ సోకినా.. అది నేరుగా మనుషులకు సోకకపోవచ్చని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. అలాగే వేరే ఏదైనా జంతువు నుంచి కూడా రాకూన్ కుక్కలకు ఈ వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్
Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!
Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?
Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ