Monday, March 27, 2023
- Advertisment -
HomeLatest NewsAir India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని...

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Air India | ఇదో వింత ఘటన ! చేసిందే తప్పు !! విమానంలో సిగరెట్ తాగడం నిషేధం అని తెలిసినా దొంగచాటుగా తాగాడు! వద్దని వారించినా వినకుండా తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించాడు. చేసిన సిగ్గుమాలిన పనికి పశ్చాత్తాపం లేకపోగా ఇంకా మొండిగా ప్రవర్తించాడు. తను చేసిన నేరానికి న్యాయస్థానం శిక్ష విధిస్తే.. దాన్నే ఎదురించాడు. ఇంటర్నెట్‌లో ఒకటి ఉంటే మీరెలా మరో శిక్ష వేస్తారని కోర్టునే నిందించాడు. జైలుకు అయినా వెళ్తా గానీ.. ఇంటర్నెట్‌లో చూపించిన ఫైన్‌కు ఒక్క రూపాయి కట్టనని మొండికేశాడు. జరిమానా కట్టడానికి నిరాకరించి హ్యాపీగా కటకటాల వెనక్కి వెళ్లాడు.

భారత సంతతికి చెందిన రత్నాకర్ ద్వివేది అనే వ్యక్తి ఇటీవల లండన్ నుంచి ముంబైకి ఎయిరిండియా విమానంలో ప్రయాణించాడు. ఆ సమయంలో బాత్‌రూంలోకి వెళ్లి అతను సిగరెట్ తాగుతుండగా.. ఫైర్ అలారం మోగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాత్‌రూం దగ్గరికి వెళ్లి అతన్ని అడ్డుకున్నారు. దీంతో అతను అరవడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించాడు. అతని ప్రవర్తనతో తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు లోనవ్వడం చూసి రత్నాకర్ ద్వివేదిని బలవంతంగా కాళ్లు, చేతులు కట్టేసి సీటులో కూర్చొబెట్టారు. విమానం ముంబై చేరుకోగానే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీకి అప్పగించారు. ఈ క్రమంలో అతన్ని అరెస్టు చేసి ఐపీసీతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1937లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసుపై విచారణ జరిపిన అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు.. రూ.25వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే సెక్షన్ 336 ప్రకారం రూ.250 జరిమానా మాత్రమే కడితే సరిపోతుందని.. తాను ఇంటర్నెట్‌లో చూశానని రత్నాకర్ కోర్టుకు చెప్పాడు. అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ కట్టనని మొండికేశాడు. కావాలంటే బెయిల్ లేకుండా జైలుకు వెళ్లేందుకే సిద్ధమని చెప్పాడు. దీంతో అంధేరి కోర్టు అతన్ని జైలుకు పంపించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

TSPSC Paper Leak | ఏఈ పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ మొబైల్‌లో యువతుల ఫోన్ నంబర్లు, నగ్న చిత్రాలు

Mohammed Siraj | గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని: సిరాజ్‌

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News