Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentPawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Pawan Kalyan | టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు హిట్టయినా.. ఫ్లాప్ అయినా టాక్‌తో సంబంధం లేకుండా చూస్తుంటారు. వరుసగా సినిమాలు ఫ్లాఫ్ అయినా సరే ఫ్యాన్స్ ఆయన్ను అభిమానిస్తూనే ఉంటారు. అందుకే టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు రెడీగా ఉంటాడు. ఇప్పుడు తన కెరీర్‌లోనే తొలిసారిగా చాలా బిజీగా గడిపేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఒకవైపు రాజకీయాలతో హీటెక్కిస్తూనే.. చేతినిండా ప్రాజెక్టులతో తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే హిస్టారికల్ ఫిలింతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ : ది ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ సినిమాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి వినోదాయ సిత్తం సినిమా రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా రెమ్యునరేషన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

తమిళంలో సూపర్ హిట్టయిన వినోదాయ సిత్తం సినిమా తెలుగు రీమేక్‌లో సాయిధరమ్ తేజ్‌తో కలిసి పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. తమిళంలో ప్రధాన పాత్రలో నటించి తెరకెక్కించిన సముద్రఖని.. తెలుగు వర్షన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే సెట్స్ మీద ఉన్న మిగిలిన సినిమాలను పక్కనబెట్టి మార్చి నెల డేట్స్‌ అన్నీ వినోదాయ సిత్తం సినిమా రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ కేటాయించాడు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ 22 రోజుల కాల్షీట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రూ.45 కోట్ల వరకు పారితోషికం పవన్ కళ్యాణ్ అందుకుంటున్నాడు. 22 రోజులకే రూ.45 కోట్లు అంటే ఒక్క రోజుకు దాదాపు రూ.2 కోట్లు అన్నమాట. ఈ కథనంలో ఎంత నిజముందో తెలియదుగానీ.. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మీద వస్తున్న గాసిప్ మాత్రం ఇప్పుడు ఫిలింవర్గాల్లో వైరల్‌గా మారింది.

ఇక ‘వినోదాయ సిత్తం’ రీమేక్ విషయానికి వస్తే.. ఈ మూవీ తెలుగు టైటిల్‌ను ఉగాది రోజు ప్రకటిస్తారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | హైదరాబాద్‌ వచ్చేసిన ఎన్టీఆర్‌.. రామ్‌చరణ్‌ ఎప్పుడు వస్తాడు? ఆస్కార్‌ విజేతల రాక ఎప్పుడు?

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News