Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsTSPSC Paper Leakage | విదేశాల్లోని బంధువులతో గ్రూప్‌-1 రాయించిన రాజశేఖర్‌.. టీఎస్‌పీఎస్సీలో చేరిన కొద్దిరోజులకే...

TSPSC Paper Leakage | విదేశాల్లోని బంధువులతో గ్రూప్‌-1 రాయించిన రాజశేఖర్‌.. టీఎస్‌పీఎస్సీలో చేరిన కొద్దిరోజులకే పెద్ద బిల్డింగ్‌.. అసలు సూత్రధారి అతనేనా?

TSPSC Paper Leakage | ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని టీఎస్‌పీఎస్సీ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఇప్పటికే సిట్‌ విచారణకు ఆదేశించిన కమిషన్‌.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేసింది. దీంతో పాటు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలను సైతం రద్దు చేసింది. అసిస్టెంట్‌ ఇంజనీర్ (ఏఈ) పరీక్ష పేపర్‌తో పాటు వీటి ప్రశ్నపత్రాలు కూడా లీకైనట్లు సిట్‌ నివేదికలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ వెల్లడించారు.

ప్రవీణ్‌ కంటే రాజశేఖరే అసలు సూత్రధారి?

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో నిందితుడు ప్రవీణ్‌ కంటే కూడా రాజశేఖర్‌ ఎక్కువగా లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన అట్ల రాజశేఖర్‌.. విదేశాల్లో ఉండే తన సమీప బంధువులకు గ్రూప్‌-1 పేపర్‌ లీక్‌ చేసినట్లు ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న దంపతులు ఇద్దరూ.. ఇండియాకు వచ్చి గ్రూప్‌-1 పేపర్‌ రాసి వెళ్లడం.. ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌లో వాళ్లు అర్హత కూడా సాధించడం ఇప్పుడు చర్చనీయంగా మారింది. ఈ క్రమంలోనే రాజశేఖర్‌ వాళ్లకు గ్రూప్‌ -1 పేపర్‌ లీక్‌ చేసినట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. టీఎస్‌పీఎస్సీలో తాత్కాలిక ఉద్యోగిగా చేరిన తర్వాతనే ఊరిలో కొత్త భవనాన్ని కూడా కట్టినట్లు తెలుస్తోంది.

ఉపాధి కోసం 2012లో అఫ్గానిస్థాన్‌ వెళ్లిన రాజశేఖర్‌ 2016లో తిరిగి స్వదేశానికి వచ్చాడు. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌పై పట్టున్న రాజశేఖర్‌.. హైదరాబాద్‌లోని పలు కంప్యూటర్‌ విభాగాల్లో అడ్మిన్‌గా పనిచేశాడు. రీసెంట్‌గా టీఎస్‌పీఎస్సీలో తాత్కాలిక ఉద్యోగిగా చేరాడు. అప్పట్నుంచి అతని లైఫ్‌స్టైల్‌ మారిపోయింది. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే ఇల్లు కూడా కట్టడంతో.. లక్షల్లో జీతం వస్తుందని అనుకున్నామని.. ఇలా లీకులు చేసి అక్రమంగా సంపాదించాడని ఇప్పుడే అర్థమవుతుందని స్థానికులు చెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News