Home Latest News Sunil Gavaskar | రోహిత్‌కు సలహా.. వార్నర్‌కు వార్నింగ్‌.. ముంబై, ఢిల్లీ సారథులకు సునీల్‌ గవాస్కర్‌...

Sunil Gavaskar | రోహిత్‌కు సలహా.. వార్నర్‌కు వార్నింగ్‌.. ముంబై, ఢిల్లీ సారథులకు సునీల్‌ గవాస్కర్‌ క్లాస్‌

Sunil Gavaskar | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ కీలక సూచనలు చేశాడు. భాగస్వామ్యాల లోపం వల్లే ముంబై స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోందని సన్నీ పేర్కొన్నాడు.

ఇప్పటి వరకు ఐపీఎల్లో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ తాజా సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రాణించాల్సిన అవసరం ఉందని సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు. గతంలో భారత జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌గా లేనప్పుడు కేవలం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా కొనసాగిన రోహిత్‌.. తన ఆట, నాయకత్వంతో జట్టుకు వరుస టైటిల్స్‌ అందించాడు. ఆ తర్వాత విరాట్‌ కోహ్లీ నుంచి మూడు ఫార్మాట్లలో జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్‌ శర్మ.. ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. హిట్‌మ్యాన్‌గా పేరున్న రోహిత్‌.. ఒక్కసారి కూడా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో గవాస్కర్‌ మాట్లాడుతూ.. ముంబై తిరిగి పుంజుకోవాలంటే భాగస్వామ్యాలు ముఖ్యం. అందులోనూ మరీ ముఖ్యంగా రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ కలిసికట్టుగా కదం తొక్కాల్సిన అవసరం ఉంది. తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదైతే.. ఆ తర్వాత దానంతటడే ఇన్నింగ్స్‌ గాడినపడుతుంది అని సన్నీ అన్నాడు. తాజా సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్‌ సేన ఓటమి పాలైంది.

‘స్కోరు బోర్డుపై భారీ స్కోరు పెట్టాలంటే.. జట్టులో మెరుగైన భాగస్వామ్యాలు నమోదవ్వాలి. ముంబై ఇండియన్స్‌ విషయానికి వస్తే.. గత రెండేళ్లుగా ఆ జట్టులో ఇదే ప్రముఖంగా లోపించింది. గత సీజన్‌లోనూ ముంబై ఈ ఇబ్బందితోనే వెనుకబడిపోయింది. తాజా సీజన్‌లోనూ అదే తడబాటు కొనసాగుతోంది. రోహిత్‌, ఇషాన్‌ మధ్య మెరుగైన తొలి వికెట్‌ భాగస్వామ్యం నమోదైతే.. ముంబైకి తిరుగుండదు’ అని గవాస్కర్‌ అన్నాడు.

ఇక ఐపీఎల్లో నెమ్మదైన ఆటతీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు కూడా గవాస్కర్‌ చురకలంటించాడు. వేగంగా ఆడలేకపోతే ఐపీఎల్‌కు రావాల్సిన అవసరం లేదని వార్నర్‌కు ఇప్పటికే సెహ్వాగ్‌ విమర్శించగా.. జట్టు టెంపో కొనసాగాలంటే పవర్‌ప్లేలో వార్నర్‌ ధాటిగా ఆడాల్సిన అవసరముందని గవాస్కర్‌ పేర్కొన్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ రోడ్డుప్రమాదంలో గాయపడటంతో ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు డేవిడ్‌ వార్నర్‌ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా సీజన్‌లో వార్నర్‌ రాణిస్తున్నా.. జట్టు అవసరాల మేరకు ఆడలేకపోతున్నాడు. దీనిపై గవాస్కర్‌ స్పందిస్తూ.. ‘పరుగులు చేయడం ఒక్కటే కాదు. జట్టుకు కూడా మెరుగైన స్కోరు అందించాలి. పవర్‌ప్లేలో మంచి రిథమ్‌ అందుకుంటే.. అది జట్టుకు ఉపయుక్తకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌లో అదే లోపించింది’ అని అన్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Duplessis | డుప్లెసిస్‌కు జరిమానా.. అవేశ్‌ఖాన్‌కు మందలింపు

RCB vs LSG | బెంగళూరులో పూరన్‌ సునామీ.. సీజన్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు.. ఆర్సీబీపై లక్నో ఉత్కంఠ విజయం

Sunrisers Hyderabad | ఎట్టకేలకు సన్‌రైజర్స్‌ బోణీ-ఉప్పల్‌ పోరులో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం

GT vs KKR | రింకూ రచ్చ రంబోలా.. ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు-ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై కోలకతా జయభేరి

Exit mobile version