Home Latest News IPL2023 | బిగ్గెస్ట్‌ క్రికెట్‌ లీగ్‌కు రంగం సిద్ధం.. ఐపీఎల్‌ తొలి పోరులో గుజరాత్‌తో చెన్నై...

IPL2023 | బిగ్గెస్ట్‌ క్రికెట్‌ లీగ్‌కు రంగం సిద్ధం.. ఐపీఎల్‌ తొలి పోరులో గుజరాత్‌తో చెన్నై ఢీ

IPL2023 | టైమ్‌ 2 న్యూస్‌, అహ్మదాబాద్‌: కరోనా మహమ్మారి కారణంగా గత మూడేండ్లుగా కొన్ని పరిమితుల మధ్య సాగిన ఐపీఎల్‌.. తిరిగి పూర్వవైభవం సంతరించుకుంది. మొత్తం 10 జట్లు టైటిల్‌ కోసం పోటీ పడుతున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌లో.. మూడేండ్లకు ముందు మాదిరిగా సొంత మైదానంలో సగం మ్యాచ్‌లు.. మిగిలిన సగం మ్యాచ్‌లు ప్రత్యర్థి వేదికలపై జరుగనున్నాయి. టెన్నిస్‌ తరహాలో సీడింగ్స్‌ విధానంలో జరుగనున్న గ్రూప్‌ దశ తొలి పోరులో గుజరాత్‌తో చెన్నై తలపడనుంది. సారథ్య బాధ్యతలు అందుకున్న తొలిసారే గుజరాత్‌కు టైటిల్‌ అందించిన పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. తనకు గురువైన మహేంద్ర సింగ్‌ ధోనీతో తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నాడు. మరి టీమ్‌ఇండియా తరఫున రెగ్యులర్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్న హార్దిక్‌ పాండ్యా వ్యూహాలను.. ఐపీఎల్‌లో మినహా మరే స్థాయిలోనూ క్రికెట్‌తో కొనసాగడం లేని ధోనీ తిప్పికొడతాడా చూడాలి!

శుభ్‌మన్‌ గిల్‌, రషీద్‌ ఖాన్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, కేన్‌ విలియమ్సన్‌, హార్దిక్‌ పాండ్యాతో కూడిన గుజరాత్‌ను ఎదుర్కోవాలంటే చెన్నై శక్తికి మించి పోరాడక తప్పేలా కనిపించడం లేదు. గుజరాత్‌ బౌలింగ్‌కు మహమ్మద్‌ షమీ, రషీద్‌ ఖాన్‌, హార్దిక్‌ కీలకం కానుండగా.. వికెట్‌ కీపర్‌గా ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. వృద్ధిమాన్‌ సాహా, శ్రీకర్‌ భరత్‌ రూపంలో ఇద్దరు దేశీయ వికెట్‌ కీపర్‌లు గుజరాత్‌కు అందుబాటులో ఉన్నారు.

మాస్టర్‌ మైండ్‌పైనే భారం

మరోవైపు మామూలు ఆటగాళ్లను సైతం మేలిమి ముత్యాలుగా మలచగల ధోనీనే సూపర్‌ కింగ్స్‌కు కొండంత అండ అనడంలో సందేహం లేదు. ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధనతో బరిలోకి దిగుతున్న ఆటగాళ్ల సంఖ్య 12కు చేరింది. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ లీగ్‌ ఆరంభ మ్యాచ్‌ల్లో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతుండగా.. కాన్వే, మోయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, అంబటి రాయుడుపై చెన్నై భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్‌ విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. ఇతర జట్లతో పోల్చుకుంటే సూపర్‌ కింగ్స్‌ బౌలింగ్‌ కాస్త బలహీనంగా కనిపిస్తున్నది. లైమ్‌లైట్‌లో లేని భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ చెన్నై పేస్‌ భారాన్ని మోయనున్నాడు. అతడితో పాటు సిమర్‌జీత్‌ సింగ్‌, పతిరణ, మహేశ్‌ తీక్షణ బౌలింగ్‌ బాధ్యతలు చూసుకోనున్నారు. ఐపీఎల్లో ఇప్పటి వరకు నాలుగుసార్లు టైటిల్‌ నెగ్గిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతుండగా.. ధోనీ సేనను నిలువరించాలని హార్దిక్‌ పాండ్యా బృందం యోచిస్తున్నది. సీజన్‌ ఆరంభానికి ముందు చెన్నై సారథి ధోనీ గాయం కారణంగా గురువారం ప్రాక్టీస్‌ సెషన్‌కు దూరమైనా.. ఆందోళన చెందాల్సిందేమి లేదని సీఎస్కే సీఈవో కాశి విశ్వనాథ్‌ స్పష్టం చేశారు. మహీ తొలి మ్యాచ్‌లో ఆడతాడని వెల్లడించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

Exit mobile version