Home Latest News Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

Tamilnadu | హిందీ భాషను బలవంతంగా రుద్దాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తమిళనాడు ప్రభుత్వం మరోసారి తిప్పికొట్టింది. ఇప్పటికే హిందీని తప్పనిసరి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు ఆదేశాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. కానీ వాటిని తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు ఎప్పటికప్పుడూ వ్యతిరేకిస్తూ వస్తోంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోలేదు. ఈ క్రమంలోనే పెరుగు ప్యాకెట్లపై ఉండే పేరును మార్చాలని ఆదేశించింది. దహీ అని హిందీలోనే పేరు ఉండాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ( FSSAI ) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తమిళనాటు తీవ్ర దుమారం చెలరేగింది.

తమిళనాడులో విక్రయించే పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంలో కర్డ్ ( curd ), తమిళంలో తయిర్ ( Tayir ) పేర్లను తొలగించి.. దహీ ( Dahi ) అని హిందీలోనే ముద్రించాలని తమిళనాడు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్‌ను ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ తాజాగా ఆదేశించింది. పెరుగు మాత్రమే కాదు.. నెయ్యి, చీజ్ వంటి డైరీ ఉత్పత్తుల పేర్లు అన్నింటినీ కూడా స్థానిక భాషలో కాకుండా జాతీయ భాష అయిన హిందీలో మాత్రమే ముద్రించాలని ఉత్తర్వులు ఇచ్చింది. తమిళనాడుతో పాటు కర్ణాటక రాష్ట్రానికి కూడా ఇవే ఆదేశాలు జారీ చేసింది. అయితే FSSAI నిర్ణయం పట్ల తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఉత్తర్వులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ కూడా మండిపడ్డారు.

హిందీని బలవంతంగా రుద్దాలనే వారి పట్టుదల మరింత పెరుగుతోంది.. చివరకు పెరుగు ప్యాకెట్‌పైనా మా సొంత భాషలో ఉన్న పేరును మార్చేసి హిందీలో రాయమని అంటున్నారు. మాతృభాషల పట్ల ఇలాంటి నిర్లక్ష్యం పనికిరాదు. దీనికి బాధ్యులైన వారిని దక్షిణాది శాశ్వతంగా బహిష్కరిస్తుంది అని కేంద్రాన్ని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వమే కాదు రాష్ట్ర బీజేపీ కూడా వ్యతిరేకించింది. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ విధానాలకు ఇది విరుద్ధంగా ఉందని, ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై డిమాండ్ చేశారు.

తమిళనాడులో వస్తున్న ఈ వ్యతిరేకత నేపథ్యంలో FSSAI వెనక్కి తగ్గింది. పెరుగు ప్యాకెట్లపై దహీ అని పేరు పెట్టాలన్న ఉత్తర్వులను సవరించింది. డెయిరీ ఉత్పత్తుల ప్యాకెట్లపై ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషల పేర్లను పెట్టుకోవచ్చని సూచించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

Priyanka Chopra | ఆర్ఆర్ఆర్ గ్రేట్ తమిళ సినిమా.. సోషల్‌మీడియాలో ప్రియాంక చోప్రాను ఏకిపారేస్తున్న నెటిజన్లు

Moto G13 | రూ.10వేలకే 50MP కెమెరా, డాల్బీ స్పీకర్లతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్

World Idli Day | ఇడ్లీలకు ఒక రోజు ఉందని తెలుసా? ఆటో డ్రైవర్‌ బర్త్‌ డే.. వరల్డ్‌ ఇడ్లీ డేగా ఎలా మారింది?

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

Telangana | పావు తులం ఉంగరం పోయిందని ప్రాణాలు తీసుకున్న యువతి

Exit mobile version