Arjun Tendulkar | మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడిగా తప్ప క్రికెట్‌కు పనికిరాడు అంటున్నా తనపై వచ్చిన విమర్శలను నెమ్మదిగా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అర్జున్ టెండూల్కర్. రెండు నెలల కిందట జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అద్భుతంగా ఆడి అందర్ని ఆకట్టుకున్న అర్జున్.. ఇప్పుడు మరోసారి తన ప్రతిభను చూపించాడు. రంజీ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన తండ్రికి తగ్గ తనయుడు అని అందరితో అనిపించుకుంటున్నాడు.
ఫస్ట్ క్లాస్ ఎంట్రీకి ముందు అర్జున్ టెండూల్కర్ మహారాష్ట్ర నుంచి 7 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 9 టీ 20లు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంపికైనప్పటికీ నైట్ ప్రాక్టీస్‌కే పరిమితమయ్యాడు. తనను సచిన్ కొడుకుగా మాత్రమే చూసేవారు తప్ప.. ఒక ప్లేయర్‌గా చూడలేదు. సచిన్ కొడుకు కాబట్టే అర్జున్‌ను అందలం ఎక్కిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అంతెందుకు ముంబై తరఫున రంజీకి ఎంపికైనా కూడా ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కలేదు. అందుకే తండ్రిలా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడుతున్నాడు అర్జున్ టెండూల్కర్. ఈ క్రమంలోనే ముంబై జట్టును వదిలేశాడు. గోవా జట్టు కోసం జరిగిన ట్రయల్స్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరిచి కోచ్‌ల దృష్టిలో పడ్డాడు. గోవా జట్టుకు ఎంపికయ్యాడు. మంగళవారం రాజస్థాన్‌తో మొదలైన గోవా మ్యాచ్‌తో రంజీ ట్రోఫీలో తొలిసారి బ్యాటింగ్‌కు దిగాడు. తొలి రోజు 15 బంతుల్లో 4 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక రెండో రోజు చెలరేగి ఆడాడు. మొత్తంగా 207 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఇలా తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. గతంలో అంటే.. 1988లో పదిహేనేళ్ల వయసులో తొలిసారి రంజీ ఆడిన సచిన్.. ఆ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఇప్పుడు 34 ఏళ్ల తర్వాత తండ్రి ఫీట్‌ను రిపీట్ చేశాడు అర్జున్.
Read More Articles |
Lionel Messi Retirement | ఇదే నా చివరి ప్రపంచ కప్.. అర్జెంటీనా స్టార్ మెస్సీ సంచలన ప్రకటన
Interesting facts | కాకి తలపై తన్నితే అపశకునమా.. మరణం తప్పదా? సైన్స్ ఏం చెబుతోంది?
Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?
Argentina in FIFA Final | కప్పుకు అడుగు దూరంలో అర్జెంటీనా.. సెమీస్‌లో క్రొయేషియా చిత్తు
most dangerous snake | ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాము.. ఇది కాటేస్తే 100 మంది బలికావాల్సిందే
Nice news articals….usefull info keep it up…
Thankyou