Tuesday, April 16, 2024
- Advertisment -
HomeNewsInternationalLionel Messi Retirement | ఇదే నా చివరి ప్రపంచ కప్‌.. అర్జెంటీనా స్టార్‌ మెస్సీ...

Lionel Messi Retirement | ఇదే నా చివరి ప్రపంచ కప్‌.. అర్జెంటీనా స్టార్‌ మెస్సీ సంచలన ప్రకటన

Lionel Messi Retirement | ఫుట్‌బాల్‌ మాంత్రికుడు, దిగ్గజ ఆటగాడు, స్టార్‌ లియోనల్‌ మెస్సీ సాకర్‌ ప్రియులకు, అర్జెంటీనా ప్రజలకు షాకింగ్‌ ఇవ్వనున్నాడా? అద్భుత ఫామ్‌లో ఉన్న అతడికి ఈ ప్రపంచకప్పే చివరిదా? ఇలా గత కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి మెస్సీ ముగింపు పలికినట్లు ఆ దేశ మీడియా చెబుతోంది. ఆదివారం జరగనున్న ఫైనల్‌ మ్యాచే తనకు చివరిది అని, మెస్సీ రిటైర్‌మెంట్‌ ప్రకటన చేసినట్లు ఆ దేశ స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. క్రొయేషియాతో మ్యాచ్‌ ముగిసిన అనంతరం మెస్సీ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు అక్కడి మీడియా చెబుతోంది.

‘‘నా ప్రపంచకప్‌ ప్రయాణం ముగింపు, నా చివరి గేమ్‌.. ఫైనల్‌ ఒకటే కావడంతో చాలా సంతోషంగా ఉన్నాను. చివరి మ్యాచే ఫైనల్‌ కావడానికి కొన్నేళ్లు పట్టవచ్చు. ఇలా జరగుతుందని అసలు నేను అనుకోలేదు. ఇక ఇదే ఉత్తమం’’ అని మెస్సీ ( lionel messi ) పేర్కొన్నట్లు అర్జెంటీనాకు చెందిన ఓ మీడియా పేర్కొంది.

‘మరోసారి మనం ఫైనల్‌కు చేరుకున్నాం. మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేయండి’’ అని సెమీస్‌లో క్రొయేషియాను ఓడించిన తర్వాత మెస్సీ తన సహచరులతో చెప్పాడట. అత్యంత కఠిన, మంచి పరిస్థితులు ఎదుర్కొన్నామని దాని ఫలితమే ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్లు మెస్సీ చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఆదివారం జరగనున్న ఫైనల్‌ మ్యాచే మెస్సీకి చివరిది అని అంతా భావిస్తున్నారు.

35 ఏళ్ల మెస్సీకి ఇది ఐదో ప్రపంచకప్‌. ఇప్పటివరకు ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న అ స్టార్‌ బరిలోకి దిగాడంటే చాలు ప్రేక్షకులు ఉర్రూతలూగాల్సిందే. ఎంతమంది అడ్డుగోడలుగా నిలిచినా బంతిని తన నియంత్రణలోనే ఉంచుకుంటూ, ఒక్కొక్కరిని అడ్డుతొలగించుకుంటూ గోల్‌పోస్టు వైపు వెళ్లడం తనకే సాధ్యం. తన మాయతో బంతిని గిరగిరాలు తిప్పుతూ ప్రత్యర్థికి చిక్కకుండా గోల్స్‌ చేసే ప్రత్యేక శైలి ప్రపంచంలో కొందరికే ఉంది. అందులో మెస్సీ అగ్రగణ్యుడు అనడంలో సందేహమే లేదు.

అర్జెంటీనా ఫైనల్‌ చేరడంతో ఆ దేశంలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా మెస్సీ ప్రపంచకప్‌నకు రిటైర్మెంట్‌ ప్రకటన ఆ దేశానికే కాకుండా సాకర్‌ ప్రపంచానికి సైతం పెద్ద వార్తగా నిలిచింది.

ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన అర్జెంటీనా ఆదిలోనే ఓటమితో ఈ ప్రపంచకప్‌ వేటను ప్రారంభించింది. గ్రూప్‌ స్థాయిలో జరిగిన తన తొలిమ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో 2-1 తేడాతో ఓటమి పాలైనప్పటికీ తిరిగి బలంగా పుంజుకున్న అర్జెంటీనా ఫైనల్‌ బరిలో నిలిచింది.

క్రొయేషియాతో జరిగిన సెమీస్‌ పోరులో ఆ జట్టును అర్జెంటీనా 3-0 తేడాతో చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లో పెనాల్టీతో ఒక గోల్‌ చేసిన మెస్సీ, మరో ఆటగాడు జులియన్‌ అల్వరెజ్‌ చేసిన గోల్‌కు పాస్‌ అందించాడు. వైఫల్యం ఎదురైనప్పటికీ ఫైనల్‌ చేరడం అంత ఆషామాషీ కాదు. ఈ విజయ ప్రస్థానంలో స్టార్‌ ఆటగాడు మెస్సీది ఎనలేని కృషి. ప్రస్తుతం ఈ ఫిఫా ప్రపంచకప్‌లో 5 గోల్స్‌ కొట్టి ఫ్రాన్స్‌ ఆటగాడు ఎంబపేతో సమానంగా ఉన్నాడు మెస్సీ.

మొత్తం ఫిఫా చరిత్రలో 11 గోల్స్‌ చేసి అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా నిలిచాడు మెస్సీ. ఫైనల్‌ పోరే తన చివరి మ్యాచ్ అని చెబుతుండడంతో ఈ ఫుట్‌బాల్‌ మాంత్రికుడు మాయ ఎలా ఉంటుందో మరి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Interesting facts | కాకి తలపై తన్నితే అపశకునమా.. మరణం తప్పదా? సైన్స్ ఏం చెబుతోంది?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Argentina in FIFA Final | కప్పుకు అడుగు దూరంలో అర్జెంటీనా.. సెమీస్‌లో క్రొయేషియా చిత్తు

most dangerous snake | ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ పాము.. ఇది కాటేస్తే 100 మంది బలికావాల్సిందే

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News