Thursday, April 25, 2024
- Advertisment -
HomeNewsAPChandrababu | సీఎం జగన్‌కు ఓటమి భయం వెంటాడుతోంది.. ముందస్తుకు వెళ్లాలా అనే ఆలోచనలో పడ్డారు:...

Chandrababu | సీఎం జగన్‌కు ఓటమి భయం వెంటాడుతోంది.. ముందస్తుకు వెళ్లాలా అనే ఆలోచనలో పడ్డారు: చంద్రబాబు

Chandrababu | ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపా ఓడిపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్‌ సర్కారుపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుందన్నారు. సీఎం జగన్‌కు ఓటమి భయం వెంటాడుతోందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా అనే ఆలోచనలో జగన్‌ పడ్డారని అన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంపై చంద్రబాబు అమరావతిలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. దక్షిణ భారత దేశంలోనే తలసరి ఆదాయంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ వెనకబడిపోయిందన్నారు. ఇందుకు కారణం జగన్‌ మోహన్‌ రెడ్డి విధానాలే కారణమని ఆరోపించారు. టీడీపీ హాయంలో 12 లక్షల ఇళ్లు నిర్మిస్తే.. వైకాపా ప్రభుత్వంలో పేదల ఇండ్లు కట్టించలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. వైకాపా విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలంతా ఇదేం ఖర్మ అని ఆవేదన చెందుతున్నారని చంద్రబాబు తెలిపారు.

13వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. జగన్‌ మోహన్‌ రెడ్డి విధనాలతో రాష్ట్రంతో పాటు వ్యక్తిగతంగా ప్రజలు అప్పుల పాలవుతున్నారని మండిపడ్డారు. రైతులు పంటను అమ్ముకునేందుకు కూడా నానా కష్టాలు పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కనీసం స్పందించడం లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే వైకాపా వల్ల నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని అన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

TTD EO | తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష.. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు

AP cabinet key decisions | ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పెన్షన్ల పెంపునకు మంత్రివర్గం ఆమోదం

AP Special Status | ఆంధ్రప్రదేశ్‌కి షాకులమీద షాకులిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేక హోదా, పోలవరంపై చేసిన కామెంట్స్‌తో దిమ్మతిరిగిపోయిందిగా!

Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి

Varahi Registration | పవన్ కళ్యాణ్ వారాహి వివాదానికి ఫుల్ స్టాప్.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ కంప్లీట్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News