Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowMost dangerous snake | ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ పాము.. ఇది కాటేస్తే 100 మంది...

Most dangerous snake | ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ పాము.. ఇది కాటేస్తే 100 మంది బలికావాల్సిందే

Most dangerous snake | మీకు తెలిసిన ప్రమాదకరమైన పాము ఏది? పాములు అంటేనే విషపూరితమైనవి.. వాటిలో ప్రమాదమైనవి అని ప్రత్యేకించి అడగడం ఏంటని చాలామంది అనుకోవచ్చు.. మరీ అడిగితే నాగు పాము, నల్ల త్రాచులు అత్యంత ప్రమాదకరమైనవని ఎక్కువమంది నుంచి సమాధానం వస్తుంది. కానీ వీటి కంటే 100 రెట్లు ప్రమాదకరమైన పాము ఒకటి ఉంది. ఇది ఎంత డేంజర్‌ అంటే ఇది ఒక్కసారి విడుదల చేసే విషంతో 100 మంది చంపవచ్చట. మరి ఆ పాము ఏంటి? అది ఎలా ఉంటుందని అనుకుంటున్నారా?

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ పాములు కేవలం ఆస్ట్రేలియాలో మాత్రం కనిపిస్తాయి. అవికూడా మారుమూల అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఇవి సంచరిస్తుంటాయి. పగటి పూట ఇవి కనిపించడం చాలా అరుదు. ఈ పాము పేరు ఇన్లాండ్‌ తైపాన్ ( Inland Taipan )‌. ఈ పాము ఒక్కసారి కాటు వేసే సమయంలో 110 మిల్లీ గ్రాముల విషాన్ని విడుదల చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ విషంతో 100 మంది మనుషులను చంపొచ్చు.. లేదా 2.5 లక్షల ఎలుకలను చంపవచ్చని అధ్యయనంలో తేలింది. ఈ పాములు 1.8 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. వీటి కోరలు 3.5 మిల్లీమీటర్ల నుంచి 6.2 మీటర్ల పొడవు ఉంటాయి. ఇక ఈ పాములు ఒక రంగులో ఉండవు. సీజన్‌ను బట్టి ఊసరవెల్లిలా తన రంగును మార్చుకుంటుంది. ఈ పాములు చలికాలంలో ముదురు గోధుమ రంగులో, వేసవి కాలంలో లేత గోధుమ రంగులో కనిపిస్తాయి. ఎలుకలు, కోడిపిల్లలను ఇవి ఆహారంగా తీసుకుంటాయని పరిశోధకులు తెలిపారు.

ప్రపంచంలో 600 విషపూరితమైన పాములు ఉన్నాయి. అయితే వీటిలో 200 పాములు మాత్రమే అత్యంత విషపూరితమైనవి. ఈ పాములు కాటేస్తే మనిషి ప్రాణాలకే ప్రమాదం. కానీ వీటన్నిటి కంటే కూడా ఇన్లాండ్‌ తైపాన్‌ మరింత డేంజరస్‌ అని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Interesting facts | కాకి తలపై తన్నితే అపశకునమా.. మరణం తప్పదా? సైన్స్ ఏం చెబుతోంది?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Aadhar Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News