Friday, April 26, 2024
- Advertisment -
HomeNewsInternationalAndrew Flintoff | రోడ్డు ప్రమాదంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు గాయాలు.. ఎయిర్...

Andrew Flintoff | రోడ్డు ప్రమాదంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు

Andrew Flintoff | ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఫ్లింటాఫ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఎయిర్ అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. ప్రస్తుతం లండన్ లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

సర్రేలోని డన్స్‌ఫోల్డ్‌లోని పార్క్ ఏరోడ్రమ్‌లో మంచు కురుస్తున్న సమయంలో షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

బీబీసీకి సంబంధించిన టాప్ గేర్ ( Top Geat ) స్పోర్ట్స్ షో షూటింగ్ సందర్భంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆండ్రూ ఫ్లింటాప్ ( Andrew Flintoff ) 2010 లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటినుంచి తనకు ఇష్టమైన టెలివిజన్ రంగంలో స్థిరపడ్డాడు. రియాలిటీ షోలలో పాల్గొంటున్నాడు. 2019 నుంచి బీబీసీ స్పోర్ట్స్ షో టాప్ గేర్ లో హోస్ట్ గా చేస్తున్నాడు. కాగా, ప్రమాద సమయంలో కారు వేగంగా లేకపోవడంతో ఫ్లింటాఫ్ కు ప్రాణాపాయం తప్పినట్లు బీబీసీ ప్రతినిధులు తెలిపారు. గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు.

ఆండ్రూ ఫ్లింటాఫ్ ఇంగ్లాండ్ తరఫున 79 టెస్టులు, 141 వన్డేలు, ఏడు టీ20లు ఆడాడు. టెస్టు క్రికెట్ లో 3845 పరుగులు చేసి 226 వికెట్లు తీశాడు. వన్డేల్లో 3394 పరగులు చేసి 169 వికెట్లు తీశాడు.

యువరాజ్ సింగ్ ( Yuvaraj singh ) 2007 టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దానికి ముందు ఆండ్రూ ఫ్లింటాఫ్‌తోనే చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో రెచ్చిపోయిన యువరాజ్ వరుసగా ఒకే ఓవర్లో ఆరు సిక్స్లులు కొట్టి భారత్ కు సంచలన విజయం అందించాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Interesting facts | కాకి తలపై తన్నితే అపశకునమా.. మరణం తప్పదా? సైన్స్ ఏం చెబుతోంది?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Argentina in FIFA Final | కప్పుకు అడుగు దూరంలో అర్జెంటీనా.. సెమీస్‌లో క్రొయేషియా చిత్తు

most dangerous snake | ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ పాము.. ఇది కాటేస్తే 100 మంది బలికావాల్సిందే

donkey gift| పెళ్లికూతురికి గాడిదను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. కారణమేంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News