Thursday, March 28, 2024
- Advertisment -
HomeLatest NewsArgentina in FIFA Final | కప్పుకు అడుగు దూరంలో అర్జెంటీనా.. సెమీస్‌లో క్రొయేషియా చిత్తు

Argentina in FIFA Final | కప్పుకు అడుగు దూరంలో అర్జెంటీనా.. సెమీస్‌లో క్రొయేషియా చిత్తు

Argentina in FIFA Final | ఫేవరెట్‌ జట్టే గెలిచింది. మరోసారి ఛాంపియన్‌గా అవతరించేందుకు అర్జెంటీనా ( Argentina ) జట్టు అడుగు దూరంలో నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫిఫా ప్రపంచకప్‌( FIFA World Cup ) సెమీస్‌ పోరులో 3-0 తేడాతో క్రొయేషియా ( Croatia )ను చిత్తు చేసిన అర్జెంటీనా విజయవంతంగా ఫైనల్లో కాలుమోపింది. తన సారథ్యంలో అర్జెంటీనాకు కప్పు అందించేందుకు ఉవ్విళ్లూరుతున్న మెస్సీ ఆ దిశగా చివరిమెట్టుపైకి వచ్చినట్టే.

ఒక గోల్‌ చేసి ఇంకో గోల్‌కు సహకరించిన మెస్సీ మరోసారి తాను ఎంతటి కీలక ఆటగాడో నిరూపించుకున్నాడు. మరో ప్లేయర్‌ జులియన్‌ అల్వరెజ్‌ రెండు గోల్స్‌ చేసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఫిఫా చరిత్రలో అర్జెంటీనా జట్టు 6వ సారి ఫైనల్‌కు చేరింది. ఇక లాస్ట్ వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన క్రొయేషియా ఈసారి మాత్రం రెండు అడుగుల దూరంలో బోల్తా పడింది.

గత ప్రపంచకప్‌ రన్నరప్‌(2018) అయిన క్రొయేషియా గ్రూప్‌ దశ నుంచి ఓటమి అన్నదే ఎరుగకుండా సెమీస్‌ చేరినప్పటికీ కీలక పోరులో అర్జెంటీనాకు దాసోహమైంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలిగోల్ కొట్టిన మెస్సీ ఫ్రాన్స్‌ ఆటగాడు ఎంబపేతో సమానంగా ఈ టోర్నీలో అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాళ్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. మరోవైపు ఫ్రాన్స్‌-మొరాకో మధ్య రేపు మరో సెమీస్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ ( France ) జట్టే హాట్‌ ఫేవరెట్‌. అయినప్పటికీ ఆఫ్రికా జట్టైన మొరాకో ( Morocco )ను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారితో అర్జెంటీనా కప్పు వేటకు దిగనుంది.

మూడింట్లో రెండో వంతు తన నియంత్రణలోనే బంతి ఉన్నప్పటికీ క్రొయేషియా ఆటగాళ్లు అర్జెంటీనా రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయారు. దూకుడుగా ఆడినప్పటికీ గోల్‌ కొట్టడంలో విఫలమయ్యారు. మరోవైపు తనకు లభించిన అవకాశాలను అర్జెంటీనా ఒడిసిపట్టుకుంది. ఇక మ్యాచ్‌ ప్రారంభమైన అరగంట వరకు ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. అయితే 34వ నిమిషంలో అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న మెస్సీ.. పెనాల్టీని గోల్‌గా మలిచాడు. దీంతో అర్జెంటీనా అభిమానుల హోరుతో స్టేడియం మారుమోగిపోయింది.

కాసేపటికే 39 నిమిషాల వద్ద జులియన్‌ అల్వరెజ్‌ అద్భుత రీతిలో గోల్‌ చేసి అర్జెంటీనాను 2-0 తేడాతో మరింత ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఇక రెండో అర్ధభాగంలో జులియన్‌ మరోసారి మాయచేశాడు. 69 నిమిషాల వద్ద మెస్సీ అందించిన పాస్‌ చక్కగా ఉపయోగించుకున్న జులియన్‌ రెండో గోల్‌ చేశాడు. దీంతో అర్జెంటీనా 3-0 తేడాతో అందనంత ఎత్తుకు వెళ్లింది. అప్పటికే అర్జెంటీనా గెలుపు వాకిట నిలిచింది.

అయితే ఎలాంటి తప్పిదాలు లేకుండా ఆ జట్టు క్రొయేషియాను ఖాతా తెరవకుండా చేసింది. క్వార్టర్స్‌లో బలమైన బ్రెజిల్‌ జట్టునే పెనాల్టీ షూటౌట్‌లో ఓడించిన క్రొయేషియా యోధులు.. సెమీస్‌లో అర్జెంటీనా ఆటగాళ్ల దూకుడుకు తలవంచక తప్పలేదు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sania – shoaib malik divorce rumours | సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోవడానికి ఆమే కారణమా? షోయబ్ తాజా వ్యాఖ్యల వెనుక అర్థమేంటి?

FIFA World cup 2022 | మెస్సీ మెరుపులు.. సెమీస్‌కు చేరిన అర్జెంటీనా

Interesting facts | కాకి తలపై తన్నితే అపశకునమా.. మరణం తప్పదా? సైన్స్ ఏం చెబుతోంది?

Money Plant | మనీ ప్లాంట్‌ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News