Saturday, September 23, 2023
- Advertisment -
HomeNewsInternationalPM Modi | షరీఫ్ వద్దు.. ఇమ్రాన్ వద్దు.. మాకు మోదీ కావాలి.. వైరల్ అవుతున్న...

PM Modi | షరీఫ్ వద్దు.. ఇమ్రాన్ వద్దు.. మాకు మోదీ కావాలి.. వైరల్ అవుతున్న పాక్ పౌరుడికి వింత కోరిక

PM Modi | పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొనడంపై అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటడంపై.. సామాన్యులు ఏ వస్తువును కొనలేని పరిస్థితిలో ఉండటంపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ పాలకుల నిర్ణయాల కారణంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. తమకు మోదీ లాంటి ప్రధాని కావాలని ఉంది అంటూ తన అసహనాన్ని బయటపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది.

పాకిస్థాన్‌కు చెందిన మాజీ జర్నలిస్టు, యూట్యూబర్ సనా అమ్జాద్‌ ఇటీవల ఓ వీడియోను తన ఛానల్‌లో పోస్టు చేసింది. నిత్యవసర ధరలు పెరిగిపోవడంపై ప్రజల్లో ఉన్న అసహనానికి సంబంధించి వారి అభిప్రాయాలను తెలుసుకుని ఆ వీడియోను పెట్టింది. అయితే అందులో తమ పాలకుల నిర్ణయాల కారణంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. తమకు మోదీ లాంటి ప్రధాని కావాలని ఉంది అంటూ తన అసహనాన్ని బయటపెట్టాడు. అందుకు అతను పాకిస్థాన్‌లో పుట్టకుండా ఉండాల్సిందని బాధపడ్డాడు. భారత దేశ విభజన జరగకుండా ఉండి ఉంటే.. తాను భారత్‌లో ఉండి ఉండేవాడనని.. 20 రూపాలకే టమాటా, 150 రూపాలయకే చికెన్.. ఇలా సరసమైన ధరలకే నిత్యావసర వస్తువులు కొనుక్కుని ఉండేవాడినని అభిప్రాయపడ్డాడు. ప్రతి రాత్రి తమ పిల్లలకు భోజనం పెట్టగలిగే అవకాశం ఉండేదని వాపోయాడు. ఇస్లామిస్ట్ దేశం వచ్చింది కానీ.. ఇక్కడ ఇస్లాంను స్థాపించలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నాడు.

“మోదీ మనకంటే గొప్పవాడు, ప్రజలు ఆయనను గౌరవిస్తారు. అలాగే అనుసరిస్తారు. మనకు నవాజ్ షరీఫ్, బెనజీర్, ఇమ్రాన్ , జనరల్ ముషారఫ్ ఎవరూ అవసరం లేదు.. మనకు మోదీ ఉంటే చాలు. దేశంలోని అన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొనగలడు.” అని చెప్పుకొచ్చాడు. అలాగే మోదీ చెడ్డవాడు కాదు.. గొప్ప వ్యక్తి.. భారతీయులకు టమాటా, చికెన్‌ను సరసమైన ధరలకు అందజేస్తున్నారు‘‘ అని పొగిడాడు. మోదీ మనకు కావాలి, ఆయన మన దేశాన్ని పాలించేలా చేయాలని ప్రార్థిస్తున్నా’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

Follow Us :  Google News, FacebookTwitte

Medical Student Preethi | వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ.. తప్పు ఎవరిదంటే..

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News