Friday, March 31, 2023
- Advertisment -
HomeEntertainmentR.Narayana Murthy | టాలీవుడ్ యాంకర్‌పై సీరియస్ అయిన ఆర్.నారాయణమూర్తి.. కారణమేంటంటే..

R.Narayana Murthy | టాలీవుడ్ యాంకర్‌పై సీరియస్ అయిన ఆర్.నారాయణమూర్తి.. కారణమేంటంటే..

R.Narayana Murthy | తెలుగు సినీ పరిశ్రమలో ఆర్‌ నారాయణ మూర్తి పేరు చెబితేనే మన కళ్ల ముందు ఉగ్రమైన రూపం సాక్షాత్కరిస్తుంది. సినిమాల్లో సీరియస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ రియల్ లైఫ్‌లో ఆయన చాలా సహనంగా ఉంటాడు. అందరితో సౌమ్యంగా, మర్యాదగా మలచుకుంటారు. పీపుల్ స్టార్‌గా వెలుగొందిన గౌరవం ఇసుమంత కూడా ఆయనలో కనిపించదు. ఆయన గురించి తప్పుడు రాతలు రాసినా కూడా అవి అబద్ధం అలా రాయకండి అంటూ రిక్వెస్ట్ చేశాడే కానీ ఎప్పుడూ సీరియస్ కాలేదు. అలాంటి వ్యక్తి ఓ యాంకర్‌పై సీరియస్ అయ్యాడు. ఆ న్యూస్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

ఇంతకీ ఆర్.నారాయణమూర్తికి కోపం తెప్పించిన ఆ యాంకర్ ఎవరని ఆలోచిస్తున్నారా? ఆమె ఎవరో కాదు స్రవంతి చొక్కారపు. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి తెరెక్కించిన సార్ సినిమా సక్సెస్ మీట్‌లో ఈ సంఘటన స్రవంతి చేసిన ఓ పనికి నారాయణమూర్తి సీరియస్ అయ్యాడు. ఈ సక్సెస్ మీట్‌కు వచ్చిన నారాయణమూర్తి కథ గురించి.. అందులోని నటీనటుల గురించి మాట్లాడాడు. తన స్పీచ్ ముగించేసిన తర్వాత హైపర్ ఆది గురించి మాట్లాడటం మరిచిపోయానని గుర్తొచ్చింది. స్టేజి దిగబోతుండగా గుర్తురావడంతో మళ్లీ మైక్ అందుకుని మాట్లాడటం ప్రారంభించాడు. పాపం.. ఈ విషయం స్రవంతి చొక్కారం గమనించలేదు. తర్వాత గెస్ట్‌లను స్టేజిపైకి పిలవడం మొదలు పెట్టింది. అలా మొదలుపెట్టేలోపు నారాయణమూర్తి కోపానికి వచ్చాడు.

“ఏ పిల్లా ఆపు. ఏ అమ్మాయ్ టైరో… టైరో. స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నా కాసేపు ఆగండి. మాట్లాడిన తర్వాత పిలవండి. సభ్యతతో ఉండండి. ప్లీజ్” అంటూ తనదైన శైలిలో కాస్త సీరియస్‌ అయ్యారు. ఆర్‌.నారాయణమూర్తి కోపానికి స్టేజి మీద ఉన్న వాళ్లు షాక్ అయ్యారు. ఎందుకలా ఆయన రియాక్ట్‌ అయ్యారు అంటూ ఆరా తీశారు. అయితే యాంకర్‌ అనుకోకుండా అలా పిలిచేశారని సమాచారం. ఇలా చాలా కార్యక్రమాల్లోనూ ఒకరు మాట్లాడుతుండగా మరొకరిని పిలిచిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఆర్‌.నారాయణమూర్తి కోపడుతున్న మాత్రం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Follow Us :  Google News, FacebookTwitte

Medical Student Preethi | వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ.. తప్పు ఎవరిదంటే..

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News