Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHealthHealth Tips | బరువు తగ్గాలని అనుకుంటున్నారా? రాత్రి పూట ఈ ఆహారానికి దూరంగా ఉండండి

Health Tips | బరువు తగ్గాలని అనుకుంటున్నారా? రాత్రి పూట ఈ ఆహారానికి దూరంగా ఉండండి

Health Tips | ఈరోజుల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామంది అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా తొందరగా బరువు పెరిగిపోతున్నారు. ఆ తర్వాత బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు ఏది వర్కవుట్ కాకపోవడంతో తలలు పట్టుకుని బాధపడుతున్నారు. అలా తర్వాత ఇబ్బంది పడే బదులు ముందునుంచే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే బరువు పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రాత్రివేళల్లో చాలామంది ఎక్కువగా తింటారు. తిన్న వెంటనే పడుకుంటారు. దీనివల్ల తొందరగా బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవాళ్లు రాత్రి సమయంలో మితంగా తినాలి. అన్నం బదులు స్నాక్స్ వంటివి తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

డైటింగ్ చేస్తున్నప్పుడు సలాడ్స్, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ఆకలి నియంత్రిస్తాయి. అయితే సలాడ్స్, ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకున్నా కూడా బరువు తగ్గడం లేదని కొంతమంది చెబుతున్నారు. దీనికి కారణం సలాడ్స్‌లో ఉపయోగించే కొన్ని ఆయిల్స్. వాటిని దూరం పెడితే మంచిది.

పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. వీటిలో అధిక కేలరీలు ఉంటాయి. కాబట్టి పండ్లను ఎక్కువగా తినాలి.

నెమ్మదిగా తినడం, ఎక్కువగా నమిలి తినడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఫోన్ మాట్లాడుతూ.. టీవీ చూస్తూ తినడం వల్ల ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. కాబట్టి ఆ అలవాట్లకు దూరంగా ఉండాలి.

పండ్లు, ఆకుకూరలు తినడం మంచిదే. అలా అని ఎక్కువ తిన్నా కూడా తొందరగా బరువు పెరుగుతారు. ఎప్పుడూ 20 శాతం కడుపు ఖాళీగా ఉంచుకునేలా చూసుకోవాలి. ముఖ్యంగా త్వరగా జీర్ణమయ్యే పండ్లను తీసుకోవడం ఉత్తమం. అరటి పండ్లు తొందరగా జీర్ణమవుతాయి. కాబట్టి బరువు పెరిగే అవకాశమే ఉండదు. అలాగే దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్ వంటివి తినడం కూడా మంచిది. వీటితో పాటు శనిగలు తీసుకోవడం కూడా ఉత్తమమే. వీటిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లతోపాటు బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియకు బాగా సహకరించి బరువును తగ్గిస్తాయి.

పెరుగులో పండ్లను కలుపుకుని తింటే చాల మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పెరుగుతోపాటు ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, అరటి పండు లాంటివి కలిపి తింటే ఇంకా మంచిది. దీనివల్ల ఆకలి వేయదని.. దీంతోపాటు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News