Home News International Virus Alert | ఆఫ్రికాలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లో ముక్కు...

Virus Alert | ఆఫ్రికాలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లో ముక్కు నుంచి తీవ్ర రక్తస్త్రావం.. ముగ్గురు మృతి

Virus Alert | ఆఫ్రికాలో మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ సోకిన 24 గంటల్లో ముక్కు నుంచి తీవ్ర రక్తస్త్రావం జరిగి ముగ్గురు మరణించారు. ఆఫ్రికాలోని బురుండిలోని బజరిలో అనే పట్టణంలో ఈ వైరస్ వ్యాపించింది. ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో మరిన్ని ప్రాంతాలకు ఈ వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం బజరి పట్టణంలోని ప్రజలను క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది.

కొత్త వైరస్ సోకిన వాళ్లలో జ్వరం, తలనొప్పి, నీరసం, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంత మందిలో ఆస్పత్రికి చేరే కంటే ముందే తక్కువ సమయంలోనే తీవ్ర రక్తస్త్రావం అవుతోందని, దీని వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు తెలిపారు. కాగా, ఈ వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇది వైరస్ బగ్‌లా కనిపిస్తోందని బురుండియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ అతలాకుతలం అయ్యాయి. కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే టాంజానియాలో మార్బర్గ్ వైరస్ వ్యాపించింది. కొన్నేళ్ల క్రితం ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మారణహోమం సృష్టించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Covid Cases | దేశంలో భారీగా పెరిగిన కరోనా.. 15వేలు దాటిన యాక్టీవ్ కేసులు

IPL 2023 New Rules | ఐపీఎల్‌ కొత్త రూల్స్‌ తెలుసా!

IPL 2023 | తొలి పోరుకు హైదరాబాద్‌ సారథిగా భువనేశ్వర్‌ కుమార్‌

Exit mobile version