Thomas Lee | అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ థామస్ లీ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆఫీస్లో తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం మన్ హట్టస్లోని తన కార్యాలయానికి వచ్చిన థామస్ లీ ఎంతసేపు అయినా గదిలో నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. లోపలికి వెళ్లి పరిశీలించగా రక్తపు మడుగులో పడిపోయి కనిపించాడు. దీంతో కంగారు పడిపోయిన సిబ్బంది 911కు సమాచారం అందించారు. కాగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపు ఆయన మరణించాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. థామస్ లీ తుపాకీతో కాల్చుకున్నట్లుగా నిర్ధారించారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. సుమారు 16 వేల కోట్ల సంపద ఉన్న థామస్ లీ చనిపోవడం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
థామస్ లీ వయసు ప్రస్తుతం 78 సంవత్సరాలు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్రరాజ్యంలో పేరున్న ఇన్వెస్టర్ థామస్ లీ. ఫైనాన్షియర్, ప్రైవేట్ ఈక్విటీ మార్కెట్, పెట్టుబడి వ్యాపారాల్లో ఆయన తన సత్తా చాటారు. దాదాపు 5 దశాబ్దాలుగా వందలాది సంస్థల్లో ఆయన 15 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. సంపాదించిన డబ్బును దానం చేయడంలోనూ థామస్ లీ ఎప్పుడూ ముందుంటారు. ది లింక్లన్ సెంటర్, మ్యూజియం అండ్ మోడ్రన్ ఆర్ట్, బ్రాండీస్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, మ్యూజియం ఆఫ్ జెవిష్ హెరిటేజ్ వంటి సంస్థల్లో ఆయన ట్రస్టీ హోదాల్లో బోర్డు సభ్యుడిగా వ్యహరించారు.
Follow Us : Google News, Facebook, Twitter