Home Latest News Bandi Sanjay | పిల్లలను రాజకీయాల్లోకి లాగుతావా.. నీకు దమ్ముంటే నాతో రాజకీయం చెయ్.. కేసీఆర్‌‌కు...

Bandi Sanjay | పిల్లలను రాజకీయాల్లోకి లాగుతావా.. నీకు దమ్ముంటే నాతో రాజకీయం చెయ్.. కేసీఆర్‌‌కు బండి సవాల్.. తన కొడుకుపై కేసు పెట్టడంపై ఆగ్రహం

Bandi Sanjay | తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ” కేసీఆర్ నువ్వు మనిషివేనా.. దమ్ముంటే నాతో రాజకీయం చేయు.. చేతగాక, నన్ను తట్టుకోలేక నా కొడుకును లాగుతావా? చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దనే సోయి కూడా లేదా ” అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ కుమారుడు భగీరథపై మహీంద్ర వర్సిటీ కమిటీ ఫిర్యాదు మేరకు మంగళవారం దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై బండి సంజయ్ స్పందించారు.

తానే తప్పు చేసినట్లు శ్రీరాం అనే అబ్బాయి ఒప్పుకున్నాడని, అయినా పిల్లలు కొట్టుకుంటారు.. కలిసి పోతారు. కేసులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఎవరు ఫిర్యాదు చేశారు.. కేసులతో ముగ్గురు పిల్లల జీవితాలను నాశనం చేస్తారా అంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు. ఇంటర్మీడియట్ పిల్లలను చంపిన పాపం ఊరికే పోలేదని, అప్పటి నుంచి కేసీఆర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అయిందని అన్నారు. నా కొడుకు క్యూ మార్టుకు పోయి గొడవ చేయలేదని, మందు కోసం లొల్లి పెట్టలేదని.. ఎల్సీఎస్‌కు పోయి అందరినీ బెదిరించి తెల్లవార్లు డ్యాన్సులు చేయలేదని, అధికారం లేకున్నా భద్రాద్రిలో తలంబ్రాలు మోయలేదని, అమ్మాయిలతో స్కూళ్లలో డ్యాన్సులు చేయించలేదని అన్నారు. అంతేకాదు.. నేను తలచకుంటే నీ మనవడు చేసిన వాటిని బయటపెట్టడానికి గంట కూడా పట్టదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నువ్వు చేసేది కరెక్టా కాదా అనేది నీ భార్య, కోడలిని అడుగు.. అంటూ బండి సంజయ్ కేసీఆర్‌పై మండిపడ్డారు.

అటు మహీంద్ర యూనివర్సిటి ఫిర్యాదు చేయడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. తన కొడుకు తప్పు చేస్తే తానే పోలీసులకు సరెండర్ చేయిస్తానని చెప్పారు. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను, వేధింపులను ఆపే చేతకాదు కానీ చిన్నపిల్లలపై కేసులు పెట్టి వాళ్ల జీవితాలను నాశనం చేస్తావా అంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.

అసలేం జరిగింది..

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తోటి విద్యార్థి శ్రీరాంపై దాడి చేస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న భగీరథ్.. శ్రీరాంపై దాడి చేయడమే కాకుండా రాయలేని భాషలో భూతులు తిడుతూ చావబాదడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. పక్కన ఉన్న భగీరథ్ స్నేహితుడు కూడా శ్రీరాంపై దాడి చేయడం కనిపించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భగీరథ్ హెచ్చరిస్తున్నట్లుగా వీడియోలో ఉంది. మంత్రికి చెప్పినా ఎవరూ ఏమీ చేయలేరంటూ వ్యాఖ్యానించడం వీడియోలో ఉంది. దీనిపై మహీంద్ర వర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండి భగీరథ్‌పై దుండిగల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ర్యాగింగ్ యాక్ట్‌తో పాటు మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. వీడియో వైరల్‌గా మారడం, భగీరథ్ పై కేసు నమోదు కావడంతో బాధిత విద్యార్థి స్పందిచాడు. తప్పు తనదే అంటూ ప్లేటు ఫిరాయించాడు. దీనిపై బండి సంజయ్ స్పందించారు. చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగి పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండి పడ్డారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

America Mega Million Jackpot | అన్‌ లక్కీడే రోజే జాక్‌పాట్‌.. లాటరీలో రూ.10వేల కోట్లు గెలుచుకున్నాడు..

New Corona Variant | అత్యంత ప్రమాదకారిగా కరోనా సూపర్ సబ్ వేరియంట్.. అమెరికాలో వైరస్ వ్యాప్తికి కారణమిదే.. భారత్‌లోనూ 26 కేసులు

Uppal Match | హోంగ్రౌండ్‌లో బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌.. గల్లీబాయ్‌కు అండగా రోహిత్‌ శర్మ

Junior NTR | యంగ్‌ టైగర్‌ని కలిసిన టీమిండియా ఆటగాళ్లు..ఎక్కడంటే!

Exit mobile version