Home Latest News GB Whatsapp | మీరు వాడుతున్న వాట్సాప్ అసలైనదేనా?

GB Whatsapp | మీరు వాడుతున్న వాట్సాప్ అసలైనదేనా?

GB Whatsapp | మీరు వాట్సాప్ వాడుతున్నారా? ఇదేం ప్రశ్న.. ఈ రోజుల్లో వాట్సాప్ వాడని వాళ్లు ఎవరైనా ఉంటారా అని అడుగుతారేమో. నిజమే వాట్సాప్ వాడని వాళ్లు ఎవరు లేరనే చెప్పొచ్చు. డ్యుయల్ సిమ్లు వాడే కొంతమంది అయితే రెండు వాట్సాప్లను కూడా ఇన్స్టాల్ చేసుకుంటుంటారు. అదేంటి రెండు వాట్సాప్లు ఎలా ఇన్స్టాల్ అవుతాయనే కదా మీ అనుమానం. అసలైన వాట్సాప్ అయితే ఇన్స్టాల్ అవ్వొదు. కానీ అచ్చం వాట్సాప్ను పోలిన మరో క్లోన్ వాట్సాప్ మాత్రం ఇన్స్టాల్ అవుతుంది. అప్పట్లో దీన్ని చాలామందే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ ఇది ప్రమాదకరమైన యాప్ అని భావించిన గూగుల్.. దాన్ని అప్పట్లోనే దీన్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయితే ముందుగా ఇన్స్టాల్ చేసుకున్న యూజర్లు దాన్ని అలాగే వాడుతున్నారు. అంతేకాదు కొంతమంది అయితే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసుకుని మరీ వాడుతున్నారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన యాప్ అని.. దీన్ని వాడితే మన పర్సనల్ డేటాతో పాటు డబ్బులు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ సంస్థ కూడా ఆ యాప్ను డిలీట్ చేయకుంటే.. ఎప్పటికీ తమ యాప్ను శాశ్వతంగా వాడలేని విధంగా నిషేధం విధిస్తున్నామని వార్నింగ్ కూడా ఇచ్చింది.

జీబీ వాట్సాప్ అంత ప్రమాకరమా?

అవును.. చాలా ప్రమాదకరం. కానీ దీనిపై మనకు అస్సలు అనుమానం రాదు. నిజమైన వాట్సాప్తో పోలిస్తే అదనపు ఫీచర్లు ఎన్నో ఉండటంతో చాలామంది ఈ జీబీ వాట్సాప్ను వాడుతున్నారు. కానీ ఈ యాప్ మాల్వేర్ ఫైళ్లతో ఫోన్పై నిఘా పెడుతుంది. మనం మొబైల్లో ఏమేమీ చేస్తున్నామని గమనిస్తుంది. తీరిగ్గా మన పర్సనల్ డేటాతో పాటు బ్యాంకింగ్, సోషల్మీడియా అకౌంట్ల వివరాలను హ్యాకర్లకు చేరవేస్తుంది. అందుకే అప్పట్లో గూగుల్ ఈ యాప్ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయినప్పటికీ ఏపీకే ఫైల్ ద్వారా దీన్ని వాడుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇలాంటి అన్సపోర్టెడ్, క్లోన్ యాప్లను వెంటనే డిలీట్ చేయాలని వాట్సాప్ హెచ్చరించింది. ఒకవేళ వినకుండా అలాగే వాడితే వారిపై శాశ్వత నిషేధం విధిస్తామని పేర్కొంది.

నకిలీ యాప్ల నుంచి ఎలా బయటపడాలి?

వాట్సాప్ యాప్ను కచ్చితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకునే ముందు అది అసలైనదేనా కాదా అన్న విషయాన్ని వెరిఫై చేసుకోవాలి.

  • ముందు వాట్సాప్ అప్లికేషన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను చెక్ చేసుకోండి. నకిలీదని అనుమానం వస్తే వెంటనే అన్ ఇన్స్టాల్ చేయండి.
  • కచ్చితంగా వాట్సాప్ యాప్, దాని అప్డేట్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. ఐవోఎస్ యూజర్లు అయితే యాప్ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి.
  • మొబైల్లో ఏదైనా సస్పియెస్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యిందేమో చెక్ చేసుకోవాలి. అలాంటి ఫైల్ ఏదైనా ఉంటే వెంటనే డిలీట్ చేయాలి. అన్ని అకౌంట్ల పాస్వర్డ్లను కూడా మార్చుకోవడం ఉత్తమమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Read More Articles |

Pavel Antov | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యతిరేకించే ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు.. ఏమైనా కుట్ర కోణం ఉందా?

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు ఉంటుందా?

Exit mobile version