Saturday, September 23, 2023
- Advertisment -
HomeLatest NewsKCR on Kavitha | ఇప్పుడు నా బిడ్డ జోలికి వచ్చారు.. అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి.....

KCR on Kavitha | ఇప్పుడు నా బిడ్డ జోలికి వచ్చారు.. అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి.. కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు !

KCR on Kavitha | బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందినప్పటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ స్పందించారు. కేంద్రం పై విరుచుకుపడ్డారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు.

రేపో మాపో కవితను అరెస్ట్‌ చేయవచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ.. అందర్నీ ఇలాగే వేధిస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భయపడేది లేదు.. పోరాటం వదిలేది లేదన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామంటూ నేతలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం చూడాల్సి వస్తుందని కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటికే పలువురు మంత్రులు, కొందరు ముఖ్యనేతల పై దాడులు జరిగినట్లు ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశముందని కూడా తెలిపారు.

గతంలో గంగుల కమలాకర్, రవిచంద్రపై కూడా దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. ఇప్పుడు ఏకంగా నా బిడ్డ కవిత వరకు వచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరని వాళ్లను కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. కవితను కూడా బీజేపీలో చేరమన్నారని గుర్తు చేశారు. మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు అంటూ కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జరిగింది ఇదే..

ఇదిలా ఉండగా శనివారం కవిత ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఆమెను ఇప్పటికే అరెస్ట్ అయిన అరుణ్‌ పిళ్లైతో కలిపి విచారించనున్నట్లు సమాచారం. అరుణ్ పిళ్లై ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో.. తాను కవిత బినామీనని చెప్పిన విషయం తెలిసిందే. పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే.. ఈడీ విచారణకు కవిత విచారణకు హాజరు కానుంది.

ఈ నేపథ్యంలో శనివారం ఏం జరగనుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలో అరుణ్ పిళ్లై మరో ట్విస్ట్ ఇచ్చాడు. తాను గతంలో ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. పిళ్లై వేసిన పిటిషన్‌తో ఈడీకి కోర్టు నోటీసులు ఇచ్చింది. మరోవైపు.. అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టులో పలుమార్లు కవిత పేరును ఈడీ ప్రస్తావించటం మరింత ఆసక్తిని రేపుతోంది. దీంతో.. శనివారం ఏం జరుగుతుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ.. కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కార్యచరణ ఏంటన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News