Wednesday, April 24, 2024
- Advertisment -
HomeNewsInternationalXi Jinping | నిబంధనలకు అతీతంగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌ పింగ్

Xi Jinping | నిబంధనలకు అతీతంగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌ పింగ్

Xi Jinping | చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన షీ జిన్‌ పింగ్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న జిన్‌ పింగ్‌ ముచ్చటగా మూడోసారి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా రికార్డు సృష్టించారు.

జిన్ పింగ్‌కు మరో ఐదేళ్ల పాటు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్‌ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. దీంతో చైనాకు జీవితకాల అధినాయకుడిగా ఉండేందుకు మార్గం సుగమమం అయ్యింది. ఐదేళ్లకు ఒకసారి జరిగే.. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా కాంగ్రెస్‌ సమావేశాలు 2022 అక్టోబర్‌లో జరిగాయి. ఈ సమావేశాల్లో 69 ఏళ్ల జిన్‌పింగ్‌ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

దీంతో సీపీసీ వ్యవస్థాపకుడు మావో తర్వాత మూడోసారి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా జిన్‌పింగ్‌ ఘనత సాధించారు. సీపీసీలో జిన్ పింగ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో.. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీపీసీ నిర్ణయాలనే యథాతథాగా అమలు చేస్తూ ‘రబ్బర్‌ స్టాంప్‌ పార్లమెంట్’గా పేరొందిన నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ .. జిన్‌పింగ్‌ను మూడోసారి అధ్యక్షుడిగా శుక్రవారం ఎన్నుకుంది.

2,952 మంది సభ్యులు ఆయనను ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక తర్వాత.. జిన్‌పింగ్‌ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. అలా మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికై జిన్ పింగ్ చరిత్ర సృష్టించారు. ఉపాధ్యక్షుడిగా జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు హన్‌ ఝెంగ్‌ను ఎన్నికయ్యారు.

చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68. రెండుసార్లు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే నిబంధన ఉంది కమ్యూనిస్టు పార్టీకి. కానీ జిన్ పింగ్ ఆ నియమానికి అతీతంగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీని కోసం 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవ‌రించారు. దీంతో జిన్​పింగ్ తన జీవిత కాలం అధ్యక్షుడిగా కొనసాగటానికి దారులు వేసుకున్నట్లుగా భావించవచ్చు.

కాగా..ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా గుర్తింపు తెచ్చుకున్న చైనా సాయుధ దళాలకు అధిష్ఠానం కేంద్ర మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌గానూ జిన్‌పింగ్‌నే ఎన్నుకుంటూ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ నేడు తీర్మానించింది. దీంతో అధికారాలన్నీ మళ్లీ జిన్‌పింగ్‌ చేతుల్లోకే వెళ్లాయి.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా, మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌గా చైనా లోని మూడు అధికార కేంద్రాలకు ఆయన నాయకుడిగా కొనసాగనున్నారు. దీంతో ఇక జిన్‌పింగ్‌ జీవితకాలం అధికారంలో ఉండనున్నారని అనుకోవాల్సిందే. దీంతో చైనా అంటే జిన్ పింగ్.. జిన్ పింగ్ అంటే చైనా అనేలా పేరొందారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News