Home Latest News Manikrao Thakre | తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంఛార్జిగా మాణిక్‌ రావ్‌ థాక్రే

Manikrao Thakre | తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంఛార్జిగా మాణిక్‌ రావ్‌ థాక్రే

Manikrao Thakre | తెలంగాణ కాంగ్రెస్‌లో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త ఇంఛార్జిని అధిష్ఠానం నియమించింది. గతంలో మహారాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాణిక్‌ రావ్‌ థాక్రేను తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంఛార్జిగా నియమించింది. మాణిక్యం ఠాగూర్‌ను గోవా కాంగ్రెస్‌ ఇంఛార్జిగా పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. మాణిక్యం ఠాగూర్‌ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న్టట్లు తెలుస్తోంది.

టీ కాంగ్రెస్‌ ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మాణిక్కం ఠాకూర్‌ బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించిన అధిష్ఠానం గోవా కాంగ్రెస్‌ బాధ్యతలను అప్పగించింది. మరోవైపు తెలంగాణకు కొత్త ఇంఛార్జిగా మహారాష్ట్ర మాజీ మంత్రి మాణిక్‌రావ్‌ థాక్రేను నియమించింది.

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మాణిక్కం ఠాకూర్‌ను మొదట్నుంచి తీవ్రంగా వ్యతిరేకించారు. రేవంత్‌ రెడ్డికి అనుకూలంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలుమార్లు ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్‌ కమిటీల విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో లొల్లి తారా స్థాయికి చేరింది. దీంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం దిగ్విజయ్‌ సింగ్‌ను రంగంలోకి దించింది. ఆయన ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే మాణిక్యం ఠాగూర్‌ తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Telangana Congress | టీ కాంగ్రెస్‌ ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం ఠాగూర్‌.. త్వరలో కొత్త ఇంఛార్జి

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Metro Station | ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వృద్ధురాలు.. స్పాట్‌లోనే మృతి

Telangana IPS | తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. సీవీ ఆనంద్‌, స్టీఫెన్‌ రవీంద్రకు అదనపు బాధ్యతలు

Bandi Sanjay | యువతను బీజేపీకి దూరం చేసేందుకే నోటిఫికేషన్లు: బండి సంజయ్‌

Exit mobile version