Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు ( 05-01-2023 )

Horoscope Today | రాశిఫలాలు ( 05-01-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగ, వివాహ యత్నాలకు అనుకూలమైన కాలం. నూతన విద్య అవకాశాలు పొందుతారు.

వృషభం

వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగుతారు.

మిథునం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం.

కర్కాటకం

శ్రమ మీది ఫలితం వేరే వాళ్లది అన్నట్టుగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుతుంది. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

సింహం

ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. నూతన వస్తు కొనుగోలు సూచన ఉంది.

కన్య

ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కార్య జయం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు

Horoscope Today | తుల

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటాబయటా ప్రోత్సాహం దక్కుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు

వివాహ యత్నాలకు అనుకూలమైన సమయం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రగతి సాధిస్తారు. రుణ ఒత్తిళ్లనుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మకరం

పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు అందుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తారు. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. వాహన సౌఖ్యం ఉంది.

కుంభం

ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. శ్రమ మీది ఫలితం వేరొకరిది అన్నట్టు ఉంటుంది. వివాహ, ఉద్యోగ యత్నాల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు.

మీనం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుకుంటారు. సోదరులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తు కొనుగోలు సూచన కలదు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

Exit mobile version