Home Latest News CM KCR | తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌.. పంట నష్టపోయిన రైతులకు...

CM KCR | తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌.. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10వేలు!

CM KCR | తెలంగాణలో అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మహబూబాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఇటీవల అకాల వర్షాల వల్ల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో సీఎం కేసీఆర్‌ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి వారికి భరోసానిచ్చారు సీఎం.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్‌ వర్షాల వల్ల దెబ్బదిన్న రైతులకు ఎకరానికి రూ. 10 వేల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి జీవో జారీ చేసిందన్నారు. పట్ట దెబ్బతిన్న రైతులు నారాజ్‌ కావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా సాయం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.22 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఈ సందర్భంగా అన్నారు.

భారత దేశానికి కొత్త అగ్రికల్చర్‌ పాలసీ రావాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఈ దేశంలో ఓ పద్ధతి, పాడు లేదని, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్పితే రైతులకు మేలు చేసే బీమాలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలు కూడా సరిగా లేవన్నారు. పంట నష్టానికి సంబంధించి మేం లెక్క రాసి కేంద్రానికి పంపితే కమిటీ ఎప్పుడొస్తుందో కూడా తెల్వదని, రిపోర్టు ఎప్పుడు ఇస్తుందో ఆ దేవుడికే ఎరుక అంటూ విమర్శించారు. కేంద్రానికి చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒకటే రకంగా ఉందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దొంగలు పడ్డంక ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు ఆర్నెళ్ల దాకా రూపాయి రాదని, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా ఉందని, వాళ్లకు రాజకీయాలు తప్పితే రైతులు అవసరం లేదని అన్నారు. అందుకే కేంద్రానికి నివేదిక పంపాలని అనుకోవడం లేదన్నారు. తెలంగాణకు దేవుడు ఆర్థిక శక్తి ఇచ్చిండు కాబట్టి వంద శాతం మేమే ఆదుకుంటామని స్పష్టం చేశారు.

సదువూ శాత్రం లేనోళ్లు కేంద్రంలో రాజ్యమేలుతున్నారని కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పనికిమాలినోళ్లు అంటూనే వాళ్లకు చెప్పినా అర్థం కాదని, సమస్యను అర్థం చేసుకునే సంస్కారం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినా ఆదుకోలేదని, రెండు మూడు సార్లు పంట నష్టం గురించి నివేదికలు ఇచ్చిన స్పందించలేదన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

AP MLC Elections | టీడీపీకి క్రాస్‌ ఓటింగ్‌ వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ నలుగురేనా.. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు ?

AP MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి విజయం

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

Exit mobile version