Home Lifestyle Horoscope & Vaasthu Daily Horoscope | రాశిఫలాలు (24-03-2023 )

Daily Horoscope | రాశిఫలాలు (24-03-2023 )

Image Source : Pixabay

Daily Horoscope | మేషం

శ్రమ తప్ప ఫలితం ఉండదు. ముఖ్యనిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. స్వల్ప ధనలాభం పొందుతారు.

వృషభం

చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు. వస్తు లాభం పొందుతారు.

మిథునం

రుణబాధలు తొలగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రముఖులున కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి,వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కర్కాటకం

విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలగజేస్తుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల్లోని వారికి సన్మాన యోగం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

సింహం

వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. పనుల్లో అవాంతరాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు.

కన్య

సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లు తొలగుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

తుల

నూతన మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అతిథులను కలిసి కీలక విషయాలు తెలుసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు

బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి.

మకరం

ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం అన్నివిధాలా మంచిది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి.

కుంభం

ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సోదరులను కలుసుకుంటారు.

మీనం

పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం కలదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

Exit mobile version