Home News AP AP MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. అనూహ్యంగా టీడీపీ...

AP MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి విజయం

AP MLC Elections | ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి షాక్‌ తగిలింది. వైసీపీ నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరగడంతో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి, విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. విజయానికి 22 ఓట్లు అవసరం కాగా ఆమెకు 23 ఓట్లు వచ్చాయి.

మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ ఒక స్థానం, వైసీపీ 6 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది. అధికార వైసీపీ నుంచి పోతుల సునీత, మర్రి రాజశేఖర్, ఏసు రత్నం, ఇజ్రాయెల్‌, పెనుమత్స సూర్యనారాయణరాజు గెలుపొందారు. రెండో ప్రధాన్య ఓటుతో వైసీపీ అభ్యర్థి జయ మంగళ వెంకట రమణ విజయం సాధించారు. క్రాస్‌ ఓటింగ్‌ దెబ్బకు వైసీపీ అభ్యర్థి కోల గురువులు ఓటమి పాలయ్యారు.

అసలేం జరిగింది..

2018 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లో విజయం సాధించింది. అయితే వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యులే మిగిలారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయానికి 22 మంది సభ్యులు అవసరం. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా తగినంత సంఖ్యా బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధను బరిలో నిలిపారు. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటంతో అనూహ్యంగా విజయం సాధించారు.

Exit mobile version