Hero Vishal on YS Jagan | తమిళ హీరో విశాల్ తనపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతాడని, టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేసే కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా లాఠీ చిత్రం ప్రమోషన్లో భాగంగా తిరుపతిలో రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై విశాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఏపీ సీఎం జగన్ అంటే తనకు ఇష్టం అంటూ విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ” నాకు వైఎస్ జగన్ అంటే ఎంతో ఇష్టం. ఐ లవ్ సీఎం జగన్.. ఆ పేరు నా గుండెల్లోంచి వస్తుంది” అంటూ ఏపీ సీఎంపై అభిమానాన్ని చాటుకున్నాడు. ఒకవేళ ఓటు వేయాల్సి వస్తే మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తప్ప మరెవరికీ వేయను అంటూ కుండబద్దలు కొట్టాడు.
సీఎం జగన్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ వైసీపీలో చేరడం లేదన్నారు. ఏపీ రాజకీయాల్లోకి రావడం లేదంటూ విశాల్ స్పష్టం చేశాడు. కుప్పంలో వ్యాపారాలు ఉన్నాయని చెప్పాడు. అక్కడి ప్రతి విషయం తెలుసన్న విశాల్.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన మాత్రం లేదన్నాడు. ఎమ్మెల్యే కంటే ఎక్కువగానే సినిమా హీరోగా సంపాదిస్తున్నానని స్పష్టం చేశాడు. ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదన్న విశాల్.. ప్రజాసేవ చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉంటే ఎలాగైనా చేయొచ్చని అన్నాడు. దీంతో ఇన్నాళ్లుగా విశాల్‌పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లైంది.
Read More Articles |
Bigg Boss season 7 | బిగ్‌బాస్ 7 ను బాలయ్య హోస్ట్ చేస్తాడా? నాగార్జున మనసులో ఉన్న హీరో ఎవరు?
Mrunal Thakur | రెమ్యునరేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్
Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్