Singer Mangli | ప్రముఖ గాయనీ మంగ్లీ కారు పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలుగులో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మంగ్లీ.. ఇతర భాషల్లో కూడా తన గాత్రంతో ఆలరిస్తోంది.
కాగా గత రాత్రి మంగ్లీ కర్ణాటకలోని బళ్లారిలోని ఓ కార్యక్రమంలో పాల్గొంది. తన పెర్ఫామెన్స్ అయిపోయిన తరువాత ఆమె వేదిక వెనుక ఉన్న మేకప్ టెంట్ లోనికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున యువకులు అక్కడికి చేరుకున్నారు. ఆ టెంట్ లోపలికి ఒక్కసారిగా యువకులు వచ్చేయడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. యువకులపై స్వల్ప లాఠీఛార్జీ కూడా చేశారు. ఈ ఉద్రిక్తతల మధ్యే మంగ్లీ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి కారులో బయల్దేరారు. ఈ సందర్భంలో కొందరు ఆమె ఉన్న కారుపై రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి.

కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపూర్‌లోనూ జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొంది. అయితే ఆ సమయంలో కన్నడలో మాట్లాడాలని మంగ్లీని యాంకర్ అడగగా అందరికీ తెలుగు వస్తుంది కదా.. అందుకే నేను కన్నడ మాట్లాడలేనని ఆమె వివరించింది. మంగ్లీ కన్నడ ఇండస్ట్రీకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ ఆమె ఎందుకు కన్నడలో మాట్లాడటం లేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ మంగ్లీ కన్నడ మాట్లాడటం లేదని విమర్శలు చేస్తున్నారు. దాడికి కూడా ఇదే కారణమని భావిస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kartik Aaryan | 10 రోజుల షూటింగ్ కోసమే రూ.20 కోట్లు తీసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో
Rashmika Mandanna | అది తెలిసే విజయ్‌తో ఒప్పుకున్నా.. అసలు విషయం బయటపెట్టిన రష్మిక మంధన్నా
Kangana Ranut | ఆర్థిక ఇబ్బందుల్లో కంగనా రనౌత్.. ఆ సినిమా కోసం తన ఆస్తులన్ని తాకట్టు పెట్టిందా ?
Allu Arjun | గోల్డెన్ వీసా అందుకున్న అల్లు అర్జున్.. యూఏఈ ఇచ్చే ఈ వీసా ఎందుకంత స్పెషల్?
Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్