Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentaparna balamurali | కంప్లయింట్ ఇచ్చేంత టైమ్ లేదు.. విద్యార్థి అనుచిత ప్రవర్తనపై అపర్ణ బాలమురళి...

aparna balamurali | కంప్లయింట్ ఇచ్చేంత టైమ్ లేదు.. విద్యార్థి అనుచిత ప్రవర్తనపై అపర్ణ బాలమురళి రియాక్షన్

aparna balamurali | ఆకాశమే హద్దురా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు గుర్తింపు పొందిన అపర్ణ బాలమురళికి ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్‌కు వెళ్లిన అపర్ణతో ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అపర్ణ బాలమురళి స్పందించింది. విద్యార్థి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

తమిళనాడు ఎర్నాకుళంలోని ఓ ప్రభుత్వ న్యాయ కళశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి అపర్ణ బాలమురళి ముఖ్య అతిథిగా వెళ్లింది. ఈ సందర్భంగా స్టేజిపైకి వచ్చిన ఓ వ్యక్తి.. అక్కడ కూర్చున్న అపర్ణను చేయి పట్టుకుని ముందుకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమె భుజంపై చేయి వేసేందుకు ప్రయత్నించారు. విద్యార్థి చేష్టలతో అసౌకర్యానికి గురైన అపర్ణ.. విద్యార్థి చెయ్యి వెయ్యకుండా దూరం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సదరు విద్యార్థిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపర్ణ కూడా సదరు విద్యార్థిపై సీరియస్ అయ్యింది.

ఓ మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవరిస్తారా? అంటూ కాలేజీలో జరిగిన ఘటనపై అపర్ణ బాలమురళి సీరియస్ అయ్యింది. ఈ సంఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసే ఉద్దేశం తనకు లేదని.. అంత టైమ్ కూడా తనకు లేదని తెలిపింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు తనకు క్షమాపణ చెప్పారని బయటపెట్టింది. ఈ సంఘటనపై ఎర్నాకుళం ప్రభుత్వ న్యాయ కళాశాల విద్యార్థి సంఘం విచారం వ్యక్తం చేసింది. దీనిపై క్యాంపస్ యూనియన్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. సదరు విద్యార్థిని సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

mahanati savitri | లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్.. వ్యాపారంలో సక్సెస్ కావడానికి మహానటి సావిత్రికి సంబంధం ఉంది తెలుసా?

Kangana Ranut | ఆర్థిక ఇబ్బందుల్లో కంగనా రనౌత్.. ఆ సినిమా కోసం తన ఆస్తులన్ని తాకట్టు పెట్టిందా ?

Rakul Preet Singh | నాతో షూటింగ్ చేసి.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లు.. నాటి రోజులు గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

Allu Arjun | గోల్డెన్‌ వీసా అందుకున్న అల్లు అర్జున్‌.. యూఏఈ ఇచ్చే ఈ వీసా ఎందుకంత స్పెషల్‌?

Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్

Trisha | విజయ్ ఇంటికి సమీపంలో కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొన్న త్రిష

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News