Thursday, July 25, 2024
- Advertisment -
HomeEntertainmentRashmika Mandanna | అది తెలిసే విజయ్‌తో ఒప్పుకున్నా.. అసలు విషయం బయటపెట్టిన రష్మిక మంధన్నా

Rashmika Mandanna | అది తెలిసే విజయ్‌తో ఒప్పుకున్నా.. అసలు విషయం బయటపెట్టిన రష్మిక మంధన్నా

Rashmika Mandanna | తలపతి విజయ్‌ హీరోగా సంక్రాంతి కానుకగా వచ్చిన వారిసు ( వారసుడు ) సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. చాలా సినిమాల్లో చూసిన కథలాగే ఉందని కామెంట్లు వినిపించినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. దిల్‌ రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్ర కథ మొత్తం హీరో చుట్టే తిరుగుతుంది. ఇందులో హీరోయిన్‌ పాత్రకు పెద్ద స్కోప్‌ ఉండదు. కేవలం రెండు పాటల కోసం వచ్చి వెళ్తుంది. ఇలాంటి క్యారెక్టర్‌ను నేషనల్‌ క్రష్‌ రష్మిక ఒప్పుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. రెండు పాటల కోసమే కోట్లు పెట్టి రష్మికను తీసుకున్నారనే కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న సెటైర్లపై రష్మిక మంధన్నా స్పందించింది. ఎలాంటి స్కోప్‌ లేని పాత్రలో ఎందుకు నటించిందో కారణాన్ని వివరించింది.

తన క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్‌ లేదని తెలిసే ఒప్పుకున్నానని రష్మిక మంధన్నా బయటపెట్టింది. కేవలం విజయ్‌ సర్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వారిసు సినిమా ఒప్పుకున్నట్టు స్పష్టం చేసింది. కథ చెబుతున్నప్పుడే తన క్యారెక్టర్‌ అర్థమైపోయిందని చెప్పింది. ఉన్న రెండు పాటల్లోనే అదరగొట్టేయాలని డిసైడ్‌ అయ్యానని.. అందుకే ఒప్పుకున్నానని తెలిపింది. షూటింగ్‌ సమయంలో విజయ్‌ సర్‌ దగ్గరికి వెళ్లి ఇదే విషయాన్ని సరదాగా చెబుతుండేదాన్ని అని గుర్తు చేసుకుంది. విజయ్‌ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నానని పేర్కొంది. ఒక నటిగా అన్ని పాత్రలు చేయాలని.. అందుకే ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో నటించానని చెప్పింది. వారిసులో నటించినందుకు తన వరకు సంతృప్తిగానే ఉన్నానని స్పష్టం చేసింది.

పుష్ప సినిమా తర్వాత నేషనల్‌ క్రష్‌గా మారిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఫుల్‌ బిజీగా మారింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు బాలీవుడ్‌లో యానిమల్‌ సినిమాలో నటిస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా వస్తున్న ఈ చిత్రానికి సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడు. ఇక బాలీవుడ్‌లో రష్మిక నటించిన మిషన్‌ మజ్ను చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే బాలీవుడ్‌ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన విషయాలు చెబుతోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

mahanati savitri | లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్.. వ్యాపారంలో సక్సెస్ కావడానికి మహానటి సావిత్రికి సంబంధం ఉంది తెలుసా?

Kangana Ranut | ఆర్థిక ఇబ్బందుల్లో కంగనా రనౌత్.. ఆ సినిమా కోసం తన ఆస్తులన్ని తాకట్టు పెట్టిందా ?

Rakul Preet Singh | నాతో షూటింగ్ చేసి.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లు.. నాటి రోజులు గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

Allu Arjun | గోల్డెన్‌ వీసా అందుకున్న అల్లు అర్జున్‌.. యూఏఈ ఇచ్చే ఈ వీసా ఎందుకంత స్పెషల్‌?

Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్

Trisha | విజయ్ ఇంటికి సమీపంలో కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొన్న త్రిష

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News