Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentRakul Preet Singh | నాతో షూటింగ్ చేసి.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లు.. నాటి రోజులు...

Rakul Preet Singh | నాతో షూటింగ్ చేసి.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లు.. నాటి రోజులు గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh | కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రకుల్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తొలి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న రకుల్.. బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తాజాగా ఛత్రీవాలీ సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించింది. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన రకుల్.. తను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది.

ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడానికి ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో వివరించింది రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీలో తనకు బ్యాక్‌గ్రౌండ్ లేదని.. ఆఫర్ల కోసం ట్రై చేస్తున్నప్పుడు కాండీవాలీలో ఉండేదాన్ని అని తెలిపింది. ఆ టైమ్‌లో తన ట్రైనర్‌తో కలిసి బాంద్రాలోని ఓ కేఫ్‌లో కూర్చొని ఏయే ఆఫీసులకు వెళ్లాలి? ఎన్ని ఆడిషన్స్ ఇవ్వాలనేది ప్లాన్ చేసుకునే దాన్ని అని గుర్తు చేసుకుంది. బ్యాగులో కొన్ని డ్రెస్సులు పెట్టుకుని.. కారులోనే వాటిని మార్చుకునే దాన్ని అని చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు ఛాన్స్‌లు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవని తెలిపింది. ఒక్కోసారి అయితే తనతో షూటింగ్ చేసిన తర్వాత.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లని గుర్తు చేసుకుని బాధపడింది. అయినప్పటికీ వెనుకడుగు వేయలేదని.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లానని చెప్పింది. దీన్ని పోరాటం అని అనుకోలేదని.. కష్టపడకుండా ఏదీ రాదని భావించే మనస్తత్వం తనది పేర్కొంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | గోల్డెన్‌ వీసా అందుకున్న అల్లు అర్జున్‌.. యూఏఈ ఇచ్చే ఈ వీసా ఎందుకంత స్పెషల్‌?

Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్

Trisha | విజయ్ ఇంటికి సమీపంలో కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొన్న త్రిష

Pawan Kalyan | కొండగట్టు అంజన్న మీద పవన్‌ కళ్యాణ్‌కి అంత సెంటిమెంట్‌ ఎందుకు ? వారాహికి అక్కడే పూజలు చేయడానికి కారణమేంటి ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News