Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentJabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ - జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ...

Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్

Jabardasth | జబర్దస్త్ స్టేజీ మీద మొదలైన రాకింగ్ రాకేశ్ ( Rocking Rakesh ), జోర్దార్ సుజాత ( Jordar Sujatha ) ప్రేమ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో ఈ నెల చివరలోనే వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరిపేందుకు నిశ్చయించారు. ఈ విషయాన్ని జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుపుతూ ఆనందాన్ని పంచుకుంది.

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో రాకింగ్ రాకేశ్ టీమ్‌లో కొంతకాలంగా జోర్దార్ సుజాత స్కిట్స్ చేస్తూ కనిపిస్తుంది. ఈ టీవీ షోలోనే అందరి ముందు సుజాతకు రాకేశ్ ప్రపోజ్ చేశాడు. కానీ ఇలాంటి లవ్ ప్రపోజల్స్‌ను, లవ్ కపుల్స్‌ను చూసిన జబర్దస్త్ ఆడియన్స్.. ఇదంతా మల్లెమాల ప్రొడక్షన్స్ ట్రిక్ అని అనుకున్నారు. సుడిగాలి సుధీర్ – రష్మి గౌతమ్, ఇమ్మాన్యుయెల్ – వర్ష తరహాలో హైప్ కోసం మరో జంటను రెడీ చేస్తుందని అనుకున్నారు. కానీ తర్వాత అది డ్రామా కాదు నిజమేనని ఫ్యాన్స్‌కు తెలిసింది. రాకింగ్ రాకేశ్ ఎక్కడ ఉంటే జోర్దార్ సుజాత అక్కడే కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్స్‌కు, వెకేషన్స్‌కు వెళ్తున్నారు. రీసెంట్‌గా దుబాయ్ ట్రిప్ కూడా వెళ్లొచ్చారు. ఇలా వీళ్ల ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన టైమ్‌లో తమ పెళ్లి ఫిక్సయ్యిందంటూ ప్రకటించింది జోర్దార్ సుజాత.

తమ నిర్ణయాన్ని గౌరవించి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొంటూ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో సుజాత ఓ వీడియోను పోస్టు చేసింది. రాకెట్‌తో పరిచయం నుంచి ఇప్పటిదాకా తనతో ఉన్న జ్ఞాపకాలను ఆ వీడియోలో పంచుకుంది. ఎంగేజ్‌మెంట్ వీడియోను కూడా షేర్ చేస్తానని చెప్పింది. మంచి కుటుంబం రావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుందని.. నేను కోరుకున్న దానికంటే మంచి భర్తను నాకు దేవుడు ఇచ్చాడు. నేను చాలా అదృష్టవంతురాల్ని అంటూ చెప్పింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Priya Bhavani Shankar | డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా.. అయితే ఏంటి.. మీడియాపై హీరోయిన్‌ విసుర్లు

Rashmika Mandanna | డైరెక్టర్ దెబ్బకు దిగొచ్చిన రష్మిక.. వాళ్ల వల్లే ఇక్కడ ఉన్నానంటూ పొగడ్తలు

Jacqueline Fernandez | అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నరకంలో పడేశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News