Home News International Mobile Phones | సెల్‌ఫోన్‌లే 89 మంది సైనికుల ప్రాణాలు తీశాయి.. రష్యా సంచలన ప్రకటన

Mobile Phones | సెల్‌ఫోన్‌లే 89 మంది సైనికుల ప్రాణాలు తీశాయి.. రష్యా సంచలన ప్రకటన

Mobile Phones | సెల్‌ఫోన్లు వినియోగించడం వల్లే తమ సైనికులు ప్రాణాలు కోల్పోయారని రష్యా ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కొత్త సంవత్సరం రోజున ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన 89 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైనికులు నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లు వినియోగించడం వల్లే దాడి జరిగి ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

అసలేం జరిగింది?

తూర్పు దోనెట్స్స్ ప్రాంతంలో రష్యా సైనికులు బస చేశారు. వారు బస చేసిన శిబిరంపై ఉక్రెయిన్ క్షిపణులతో దాడి చేసింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతినుద్దేశించి ప్రసగించారు. ఆ తర్వాత కొద్ది క్షణాలకే తూర్పు దోనెట్స్క్‌లో రష్యా సైనికులు బస చేసిన శిబిరంపై దాడి జరిగింది. ఈ ఘటనలో 400 మంది రష్యా సైనికులు హతమయ్యారని, మరో 300 మందికి గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ దాడికి అమెరికా తయారు చేసిన హిమార్స్ రాకెట్లను ఉక్రెయిన్ ఉపయోగించింది. దీనిపై రష్యా తాజాగా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ దాడిలో 89 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని రష్యా తాజాగా ప్రకటించింది. తమ సైనికులు సెల్‌ఫోన్లు ఉపయోగించడం వల్లే శిబిరం గురించి ఉక్రెయిన్ కు తెలిసిపోయిందని ప్రకటించింది. భారీగా సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై రష్యా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో రష్యా రక్షణ శాఖ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాగా, మృతుల్లో ఎక్కువ మంది ఇటీవలే సైన్యం చేరినట్లు తెలుస్తోంది.

మొబైల్ ఫోన్లే కారణం..

రష్యా సైనికులు బస చేసిన వొకేషనల్ కాలేజీపై ఉక్రెయిన్ నాలుగు హిమర్స్ క్షిపణులను ప్రయోగించిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. దాడి జరగడానికి ప్రధాన కారణం మాత్రం మొబైల్ ఫోన్ల వినయోగమేనని ప్రకటించింది. ఫోన్ల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ తమ సైనికులు ఫోన్లు ఆన్ చేశారని పేర్కొంది. దీంతో శత్రువులు ఆ సిగ్నళ్లను ట్రాక్ చేసి సైనికులు బస చేసిన ప్రాంతాన్ని గుర్తించి దాడి చేశారని, ఈ ఘటనలో 89 మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది. అయితే ఈ ఘటనలో బాధ్యులను మాత్రం విడిచిపెట్టబోమని రష్యా లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ సెవ్ర్యూకోవ్ మీడియాతో తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే దొనెట్స్క్ దాడులకు ప్రతీకారంగా రష్యా కీవ్‌పై విరుచుకుపడుతోంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Numaish 2023 | హైదరాబాద్‌లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌ గురించి ఈ విషయాలు తెలుసా ? ఎంట్రీ ఫీజు ఎంతంటే?

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

Vegetarian City in India | ప్రపంచంలోనే మొదటి శాఖాహార నగరం గురించి తెలుసా ? అదీ.. మన భారత దేశంలోనే ఉంది.. ఎక్కడంటే?

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version