Home Entertainment Rashmika Mandanna | సమంతపై రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rashmika Mandanna | సమంతపై రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Image Source : Twitter

Rashmika Mandanna | మయోసైటిస్‌తో బాధపడుతున్నట్టు స్టార్ హీరోయిన్ సమంత ప్రకటించినప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ మొత్తం అండగా నిలబడింది. ఆమె త్వరగా కోలుకుని ఎప్పటిలా అవ్వాలని సెలబ్రెటీలు, ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారు. ఈ క్రమంలో చాలామంది నటీనటులు బహిరంగంగా సమంతకు మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా సమంతకు బాసటగా నిలబడింది. ఆమెను ఒక అమ్మలా సంరక్షించుకోవాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.

పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన వారిసు, మిస్టర్ మజ్ను సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక మందన్నా తాజాగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. సమంత అనారోగ్యం గురించి తలచుకుని ఎమోషన్ అయ్యింది. సమంత ఒక అద్భుతమైన మహిళ అని కొనియాడింది. ఆమె ఎంతో మంచిదని.. దయగల వ్యక్తి అని ప్రశంసించింది. సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్నట్టు ప్రకటించే వరకు తనకు కూడా ఈ విషయం తెలియదని చెప్పింది. అంతకుముందు ఎప్పుడూ తమ మధ్య ఈ విషయం గురించి మాట్లాడుకున్న సందర్భాలేవి లేవని గుర్తు చేసుకుంది. ఎన్నో సవాళ్లను ఎదురించి నిలబడిన వ్యక్తిని ఏవిధంగా అయితే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారో.. అదేవిధంగా సమంత నుంచి తను ప్రేరణ పొందానని తెలిపింది. సమంతకు అన్ని విధాలుగా మంచే జరగాలని భావిస్తున్నానని తెలిపింది.

విజయ్ దేవరకొండతో నటించడం ఇష్టం

విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేరింగ్‌పై కూడా రష్మిక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఏ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో తనతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తుందేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది. తమ ఇద్దరినీ కలిపి స్క్రీన్ మీద చూడాలని అనుకుంటున్నట్టు ఇప్పటికే పలువురు మెసేజ్‌లు వచ్చాయని తెలిపింది. వాళ్ల కోరిక మేరకు తమకు కూడా కలిసి సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. అయితే దానికి మంచి స్క్రిప్టు రావాల్సి ఉందని తెలిపింది. తమ ఇద్దరికీ సరిపోయే కథ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొంది. విజయ్ దేవరకొండతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతానని బయటపెట్టింది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Outside food in cinema halls | సినిమా హాళ్లలోకి బయటి ఫుడ్‌ తీసుకెళ్లొచ్చా? లేదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Tamanna Bhatia | నాని విలన్‌తో ప్రేమలో పడ్డ మిల్కీ బ్యూటీ .. బీ టౌన్‌లో న్యూస్‌ వైరల్‌.. సీరియస్ అవుతున్న తమన్నా ఫ్యాన్స్‌

Punarnavi | ఆ వ్యాధితో న్యూ ఇయర్ ప్రారంభిస్తున్నా.. ఎమోషన్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి

NTR 30 | ఎన్టీఆర్ 30పై ఆసక్తికరమైన అప్‌డేట్.. కొరటాలకు టెన్షన్ తప్పదా..?

Unstopabble with NBKS2 | పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ దాని గురించే ప్రత్యేకంగా అడిగారా..?

Hombale Films Journey | మూడు వేల కోట్లతో హోంబలే ఫిలింస్ భారీ ప్లాన్.. ఈసారి కేజీఎఫ్, కాంతారను మించిపోవాల్సిందే !

Samantha | జీవితం ఇంతకుముందులా లేదు.. వైరల్‌గా మారిన సమంత కామెంట్

Exit mobile version