Home Lifestyle Do you know Vegetarian City in India | ప్రపంచంలోనే మొదటి శాఖాహార నగరం గురించి తెలుసా ?...

Vegetarian City in India | ప్రపంచంలోనే మొదటి శాఖాహార నగరం గురించి తెలుసా ? అదీ.. మన భారత దేశంలోనే ఉంది.. ఎక్కడంటే?

Vegetarian City in India | భారతదేశం భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకు నిలయం. ఇక్కడి ఆచార, వ్యవహారాలే కాదు.. తినే ఆహారం కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. గుజరాత్‌ ( Gujarat )లోని పాలిటానా ( Palitana ) నగరానికి ఆహారం విషయంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నాన్‌వెజ్‌ పూర్తిగా నిషేధం. ప్రపంచంలోనే మొట్టమొదటి శాఖాహార నగరంగా ఇది రికార్డుల్లోకెక్కింది.

కొండపైన 900 ఆలయాలు

పాలిటానాలో తినడానికి జంతువులను చంపడమనేది పూర్తిగా నిషిద్ధం. మాంసం, గుడ్లు అమ్మడానికి అనుమతి లేదు. జైన మతాన్ని అనుసరించే వారికి ఇది అత్యంత పవిత్రమైన నగరం. జైనుల రక్షకుడైన ఆదినాథ ఒక్కప్పుడు పాలిటానా కొండలపై నడయాడారని అందుకే ఆయన అనుచరులకు ఈ నగరం ముఖ్యమైన ప్రదేశంగా మారిందని చెబుతారు. ఇక్కడి పర్వతంపైన జైన మతానికి సంబంధించిన 900 ఆలయాలు ఉన్నాయి.

నాన్‌వెజ్‌పై నిషేధం.. వారి పోరాట ఫలితమే

జైనులు హింసకు పూర్తిగా వ్యతిరేకం. పాలిటానా వారికి పవిత్ర స్థలం కావడంతో 200 మంది సన్యాసులు ఇక్కడ జంతు వధను వ్యతిరేకిస్తూ 2014లో నిరాహార దీక్ష చేశారు. ఇక్కడ జంతు వధను, మాంసం వినియోగాన్ని అనుమతిస్తే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని ఉద్యమం చేశారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి జంతువధను, మాంసం విక్రయాలను పూర్తిగా నిషేధించింది. ఇక అప్పటి నుంచి పాలిటానా పూర్తిగా శాఖాహార నగరంగా మారిపోయింది.

Follow Us : Facebook, Twitter

Read More Articles |

Anklets | ఆడపిల్లలు కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి.. బంగారు పట్టీలు ధరిస్తే ఏమవుతుంది?

Digital Rupee | RBI తీసుకొచ్చే డిజిటల్‌ రూపాయితో సామాన్యులకు లాభమేంటి ? ఎవరు వాడొచ్చు.. ఎంత వరకు సురక్షితం?

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Exit mobile version