Home Entertainment PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

PVR Cinemas | తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధర ఎంత ఉంటుంది? సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో అయితే రూ.150 దాకా ఉంటుంది. మల్టీప్లెక్స్‌ల్లో అయితే రూ.225 కంటే ఎక్కువగానే ఉంటుంది. మల్టీప్లెక్స్ రేంజ్‌ను బట్టి ఇది రూ.250కి పైగానే ఉంది. మరి అంత ధరలు ఉన్న టైమ్‌లో కేవలం రూ.100కే సినిమా చూసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది. వంద రూపాయలకే సినిమా టికెట్ అంటే.. ఏదో డబ్బా థియేటర్‌లో అనుకుంటున్నారేమో.. కాదండీ.. అన్ని హంగులు ఉన్న ప్రముఖ మల్టీప్లెక్స్‌లోనే ఈ ఆఫర్ ఉంది. సినీ ప్రేమికుల కోసం పీవీఆర్ సినిమాస్‌ ఈ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది.

జనవరి 20న సినీ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పీవీఆర్ సినిమాస్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఆ ఒక్కరోజు రూ.99కే సినిమా చూడొచ్చు. శుక్రవారం రోజు ఏ పీవీఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో అయినా సరే.. ఏ షో అయినా సరే.. రూ.99కే సినిమాను చూడొచ్చని పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది. అయితే ఈ టికెట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుంది. అయితే ఈ ఆఫర్ అన్ని నగరాల్లో లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది.

పంజాబ్‌లోని చండీగఢ్, పఠాన్‌కోట్‌తో పాటు పుదుచ్చేరి నగరాల్లో ఈ ఆఫర్ లేదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రూ.100 + జీఎస్టీతో సినిమా టికెట్ బుక్ చేసుకోవచ్చు. తెలంగాణలో అయితే 112+ జీఎస్టీతో పీవీఆర్ సినిమాస్‌లో ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రీమియం కేటగిరీ సీట్స్.. ఈ ఆఫర్ పరిధిలోకి రావని తెలిపింది. మరింత సమాచారం కోసం పీవీఆర్ సినిమాస్ వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

Avatar 3 | మీ సీట్ బెల్ట్‌ భద్రంగా ఉంచుకోండి.. అవతార్‌ 3 అద్భుతమైన కాన్సెప్ట్‌తో వస్తుందంటున్న జేమ్స్‌ కామెరూన్‌

Rashmi Gautam | కోడికి లేని బాధ నీకెందుకు.. నెటిజన్‌ కామెంట్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన రష్మి

priyanka jawalkar | పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చినా నటించను.. ప్రియాంక జవాల్కర్ సంచలన వ్యాఖ్యలు

Dil Raju Marriage | దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? ఏడాది వెంటపడి మరీ ప్రపోజ్ చేశాడా?

Exit mobile version